భారత్ న్యూస్ గుంటూరు….సాంప్రదాయ ఎద్దుల పోటీల నిర్వహణ అభినందనీయం.

Ammiraju Udaya Shankar.sharma News Editor…సాంప్రదాయ ఎద్దుల పోటీలను ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రముఖ పారిశ్రామికవేత్త, కూటమి నాయకులు విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు పేర్కొన్నారు.
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘంటసాలలోని జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాంగణంలో రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి వృషభ రాజముల బండలాగుడు పోటీలను నిర్వహిస్తున్నారు.
పోటీల నిర్వాహకుల ఆహ్వానం మేరకు విక్కుర్తి శ్రీనివాస్ గురువారం ఎద్దుల పోటీలను తిలకించడానికి వెళ్లారు. ఈ సందర్భంగా NRI ప్రముఖులు గొర్రెపాటి రంగనాథ్ తో కలిసిశ్రీనివాస్ కొద్దిసేపు పోటీలను తిలకించారు. అలాగే పోటీలలో పాల్గొన్న ఎద్దుల రైతులకు జ్ఞప్తికలను శ్రీనివాస్ అందించారు.
ఈ సందర్భంగా ప్రముఖ ఛానల్ రాజ్ న్యూస్ 2026 నూతన సంవత్సర క్యాలెండర్లను పోటీల నిర్వాహకులతో కలిసి విక్కుర్తి శ్రీనివాస్ ఆవిష్కరించారు.

ఎద్దుల పోటీలకు తన వంతు సహకారాన్ని అందించిన విక్కుర్తి శ్రీనివాస్ ను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.