​సోషల్ మీడియా ముసుగులో ‘హనీ ట్రాప్’.. దంపతుల అరెస్ట్

భారత్ న్యూస్ డిజిటల్ కరీంనగర్ రూరల్:

​సోషల్ మీడియా ముసుగులో ‘హనీ ట్రాప్’.. దంపతుల అరెస్ట్
​వంద మందికి పైగా బాధితులు – నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్న భార్యాభర్తల బాగోతం బట్టబయలు.

​కరీంనగర్ రూరల్:
సోషల్ మీడియా వేదికగా అమాయకులను, వ్యాపారవేత్తలను ఆకర్షించి, వారితో ఏకాంతంగా గడిపిన దృశ్యాలను రికార్డు చేసి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న కిలాడీ దంపతులను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు.

​కేసు వివరాలు:
మంచిర్యాల జిల్లాకు చెందిన దంపతులు గత కొంతకాలంగా కరీంనగర్ రూరల్ పరిధిలోని ఆరేపల్లి ‘శ్రీ సాయి నివాస’ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. భార్య తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఆకర్షణీయమైన ఫోటోలు పెడుతూ యువకులను, వ్యాపారస్తులను ప్రలోభపెట్టేది. ఆమెను సంప్రదించిన వారితో డబ్బులు మాట్లాడుకుని తన నివాసానికి పిలిపించుకునేది. వారు ఏకాంతంగా ఉన్న సమయంలో, భర్త రహస్యంగా మొబైల్ ఫోన్లలో నగ్న వీడియోలను చిత్రీకరించేవాడు.

​లక్షల్లో వసూళ్లు – విలాసవంతమైన జీవితం:
ఈ వీడియోలను చూపిస్తూ బాధితులను భయపెట్టి సదరు దంపతులు భారీగా డబ్బులు వసూలు చేసేవారు. ఈ అక్రమ సంపాదనతో వారు అపార్ట్మెంట్ ఈఎంఐలు కట్టడమే కాకుండా, టాటా కారును కొనుగోలు చేశారు. తమ ఇంట్లో ఖరీదైన సోఫా సెట్లు, ఏసీలు ఏర్పాటు చేసుకుని విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఇప్పటివరకు సుమారు 100 మందిని వీరు ట్రాప్ చేసినట్లు సమాచారం.

​వెలుగులోకి తెచ్చిన బాధితుడు:
కరీంనగర్ కు చెందిన ఒక వ్యక్తి గత ఏడాది కాలంగా వీరి వద్దకు వెళ్తున్నాడు. అతని వద్ద నుండి ఇప్పటికే సుమారు 14 లక్షల రూపాయలను వసూలు చేసిన దంపతులు, అదనంగా మరో 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, లేదంటే వీడియోలు వైరల్ చేసి చంపేస్తామని బెదిరించారు. ప్రాణభయంతో సదరు బాధితుడు నిన్న (13.01.2026) కరీంనగర్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది.

​పోలీసుల మెరుపు దాడి:
ఏసీపీ విజయ్ కుమార్ ఆదేశాల మేరకు సిఐ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో రెండు బృందాలు గాలింపు చేపట్టాయి. ఈ రోజు ఉదయం 8 గంటల సమయంలో టేస్టీ దాబా వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు.వారి నుండి నేరానికి ఉపయోగించిన కారు
​నగ్న వీడియోలు ఉన్న మొబైల్ ఫోన్లు
​బాధితుడి నుండి తీసుకున్న చెక్ లను స్వాధీనం చేసుకున్నారు.

​నిందితులను విచారించగా వారు నేరాన్ని ఒప్పుకున్నారని, మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి 14 రోజుల రిమాండ్ కు తరలించామని పోలీసులు తెలిపారు. 24 గంటల్లోనే కేసును ఛేదించిన సిబ్బందిని ఏసీపీ విజయ్ కుమార్ అభినందించారు.

​పోలీసుల విజ్ఞప్తి:
సోషల్ మీడియాలో పరిచయం లేని వ్యక్తుల ట్రాప్ లో పడకూడదని, ఎవరైనా ఇలాంటి వేధింపులకు గురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని అధికారులు కోరారు.