భారత్ న్యూస్ డిజిటల్ విజయనగరం:
//చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై చర్యలు చేపడుతున్న జిల్లా పోలీసులు//
విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్
విజయనగరం జిల్లాలో సంక్రాంతి పండగ సందర్భంగా నిర్వహించే కోడి పందాలు, పొట్టేలు పందాలు, పేకాటలు మరియు ఇతర జూద క్రీడల పై జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ జనవరి 14న తెలిపారు.
సంక్రాంతి పండగ పేరుతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా జిల్లా పోలీసులు చేపట్టిన ముందస్తు చర్యలు సత్ఫలితాలిచ్చాయని జిల్లా ఎస్పీ అన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది గ్రామాలను సందర్శించి, గ్రామ పెద్దలు, స్థానికులతో సమావేశాలు ఏర్పాటు చేసి, సంక్రాంతి పేరుతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నిర్వహించవద్దని, గ్రామాలకు చెడ్డ పేరును తీసుకురావద్దని, సంక్రాంతి పండగను సంప్రదాయ రీతిలో నిర్వహించుకోవాలని, పోలీసుశాఖకు సహకరించాలని కోరామన్నారు. నిబంధనలు అతిక్రమించి, ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే, వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించామన్నారు. గ్రామ శివారు ప్రాంతాల్లో డ్రోన్ లతో నిఘా పెట్టామని, పోలీసు, రెవెన్యూ అధికారులతో సంయుక్తంగా ప్రత్యేకంగా ముండల స్థాయిలో బృందాలను కూడా ఏర్పాటు చేసామని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు.
డెంకాడ మండలం మోపడ గ్రామ శివార్లలో పేకాట అడుతున్న వారిపై డెంకాడ పోలీసులు రైడ్ చేసి, పేకాట అదుతున్న వారిపై కేసు నమోదు చేసి, 5మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుండి రూ.50,540/- ల నగదు సీజ్ చేసామన్నారు.
ఎల్.కోట మండలం భీమాలి గ్రామ శివార్లలో పేకాట అడుతున్న వారిపై ఎల్.కోట పోలీసులు రైడ్ చేసి, పేకాట అదుతున్న వారిపై కేసు నమోదు చేసి, 15మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుండి రూ.37,890/- ల నగదు సీజ్ చేసామన్నారు.
ఎస్.కోట మండలం ఎస్.కోట గ్రామ శివార్లలో పేకాట అడుతున్న వారిపై ఎస్.కోట పోలీసులు రైడ్ చేసి, పేకాట అదుతున్న వారిపై కేసు నమోదు చేసి, 5మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుండి రూ.10,880/- ల నగదు సీజ్ చేసామన్నారు.
వంగర మండలం కొత్తవలస గ్రామ శివార్లలో పేకాట అడుతున్న వారిపై వంగర పోలీసులు రైడ్ చేసి, పేకాట అదుతున్న వారిపై కేసు నమోదు చేసి, 7మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుండి రూ.6,860/- ల నగదు సీజ్ చేసామన్నారు.
గజపతినగరం మండలం ఎం.కొత్తవలస గ్రామ శివార్లలో పేకాట అడుతున్న వారిపై గజపతినగరం పోలీసులు రైడ్ చేసి, పేకాట అదుతున్న వారిపై కేసు నమోదు చేసి, 6మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుండి రూ.2,020/- ల నగదు సీజ్ చేసామన్నారు.

సంక్రాంతి పండగ పేరుతో కోడి పందాలు, పొట్టేలు పందాలు, పేకాటలకు దూరంగా ఉండాలని, పండగను సంప్రదాయరీతిలో నిర్వహించుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించరాదని ప్రజలకు జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ మరోసారి ప్రజలకు సూచించారు.