కోడి కత్తులు తయారీ ముఠాను గుట్టు రట్టు చేసిన నల్లపాడు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు,.//

భారత్ న్యూస్ డిజిటల్:అమరావతి;
*
గుంటూరు జిల్లా పోలీస్…*
నల్లపాడు పోలీస్ స్టేషన్

//కోడి కత్తులు తయారీ ముఠాను గుట్టు రట్టు చేసిన నల్లపాడు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు,.//

📍 గౌరవ గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, ఎస్బి డీఎస్పీ శ్రీనివాసులు గారు, ఎస్బి సీఐ అలహరి శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో స్పెషల్ బ్రాంచ్ పోలీస్ సిబ్బంది జిల్లా వ్యాప్తంగా కోడి పందేలు జరగకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేసి, కోడి పందేల నిర్వహకులు, కోడి కత్తులు తయారు చేసి సరఫరా చేసే వ్యక్తులు, కోడి పందేల కోసం బరులు ఏర్పాటు చేస్తున్న వారిని గుర్తిస్తూ చట్ట ప్రకారం కఠిన చర్యలు చేపడుతున్నారు.

📍 ఈ క్రమంలో నల్లపాడు స్పెషల్ బ్రాంచ్ పోలీస్ కు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు, నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని నాయుడుపేట, అంబేద్కర్ కాలనీ (జిందాల్ ఫ్యాక్టరీ సమీపంలో)లోని ఒక నివాస గృహంలో కోడి కత్తులు తయారు చేస్తూ, వాటికి సాన పెట్టి అక్రమంగా వ్యాపారం నిర్వహిస్తున్నట్లు తెలిసింది.

📍 ఈ సమాచారాన్ని ఎస్బి సీఐ తెలియజేయగా, ఆయన ఆదేశాల మేరకు నల్లపాడు పోలీస్ స్టేషన్ సిబ్బంది సహకారంతో సదరు ఇంటిపై దాడి నిర్వహించగా, బండి బాలచంద్ర, తండ్రి బ్రహ్మయ్య, వయస్సు 49 సంవత్సరాలు, నివాసం శ్రీనివాసరావు పేట, గుంటూరు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

📍 దాడిలో భాగంగా అక్కడ ఉన్న 60 కోడి కత్తులు, మూడు కోడి కత్తులకు సాన పెట్టే మిషన్లను స్వాధీనం చేసుకొని, తదుపరి విచారణ నిమిత్తం నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

👉 సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందేలు నిర్వహిస్తూ జీవ హింసకు పాల్పడే వారిపట్ల ఎలాంటి సడలింపు ఉండదని, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు హెచ్చరించారు.