భారత్ న్యూస్ రాజమండ్రి…పడమర వీధిలో సందడిగా ముగ్గులు పోటీలు
చల్లపల్లి:
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని భోగి రోజైన బుధవారం చల్లపల్లి పడమర వీధిలోని తాళ్ల రామాలయం వద్ద మహిళలకు రంగవల్లుల పోటీలు నిర్వహించారు. 32 మంది మహిళలు ముగ్గులు పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ముగ్గుల రూపంలో ప్రదర్శిస్తున్నారు. మళ్లీ మాస్టారు ఈ రంగవల్లుల కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అందరిని ఉత్సాహపరుస్తూ ముందుకు నడిపిస్తున్నారు. అలయ్ కమిటీ సభ్యులు నారంశెట్టి శ్రీశైలరావు, మిర్యాల సుబ్బారావులు కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.
