ముగ్గుల పోటీలు,ఎడ్ల అందాల పోటీలు ఇంకా అనేక రకాల సాంప్రదాయమైన ఉత్సవాలు తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు అద్దంపడతాయని రాజేంద్ర ప్రసాద్ గారు అన్నారు.

భారత్ న్యూస్ విజయవాడ…తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబం సంక్రాంతి సంబరాలు::తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు వై వి బి రాజేంద్ర ప్రసాద్ గారు.

Ammiraju Udaya Shankar.sharma News Editor…సంక్రాంతి సందర్భంగా కాటూరు గ్రామంలో టీడీపీ నాయకులు వేమూరి శ్రీనివాసరావు,తుమ్మల చంద్రశేఖర్,కోడె హరీష్ ల ఆధ్వర్యంలో గరికపరు గ్రామంలో మండల టీడీపీ అధ్యక్షుడు శివరాం,కుమ్మమూరులో రామినేని కుటుంబయ్య, వల్లూరు పాలెం లో చింతపల్లి వెంకేశ్వరరావు గార్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపాల్లో మాజీ ఎమ్మెల్సీ వై వి బి రాజేంద్ర ప్రసాద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు,

ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ తెలుగువారు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే సంక్రాంతి పండగ సంబరాలలో నిర్వహించే ముగ్గుల పోటీలు,ఎడ్ల అందాల పోటీలు ఇంకా అనేక రకాల సాంప్రదాయమైన ఉత్సవాలు తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు అద్దంపడతాయని రాజేంద్ర ప్రసాద్ గారు అన్నారు.
ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ గారు తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జంపన శ్రీనివాస్, సయ్యద్ అజ్మతుల్లా బాబు, రాజులపాటి ఫణి,కుప్పల అంజిబాబు ఆయా గ్రామాల టీడీపీ నాయకులు కార్యకర్తలు,సంబరాలను తిలకించేందుకు వివిధ గ్రామాలనుండి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.