భారత్ న్యూస్ డిజిటల్ నిజామాబాద్:
మత్తు పదార్థాలు ఇచ్చి దొంగతనానికి పాల్పడిన ముఠా గుట్టురట్టు
నిజామాబాద్ పోలీస్ స్టేషన్ టౌన్ ఫోర్, SHO- సతీష్ కుమార్, ఎస్. ఐ ఉదయ్ కుమార్, ఎస్సై సందీప్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఫిర్యాది శ్రీనివాస్ తేదీ 17. 12. 2025 రోజున ఇచ్చినటువంటి దరఖాస్తు మేరకు పరిశోధన ప్రారంభించగా ఫిర్యాదుకి రైస్ వ్యాపారం గురించి మాయ మాటలు చెప్పి, ఫిర్యాదికి వంశీ ఇంటర్నేషనల్ హోటల్ నందు తాగే బీరులో మత్తు గోళీలు కలిపి తాగిపించి అతని వద్ద నుండి రెండు బంగారు ఉంగరాలు గోల్డ్ చైన్ కొంత నగదు దొంగిలించకపోగ, ఇట్టి విషయంపై Cr. NO: 458/2025 నందు కేసు నమోదు చేసి, లోతుగా దర్యాప్తు చేసి నిందితులైన
1)బాత ప్రసాదం
2) నర్సింగారావు
3) రుద్రా యాదవ్ ను పట్టుకొని విచారించగా వారు ఈ కేసులో నేరం ఒప్పుకున్నందున వారి నుండి కొంత నగదును వారి యొక్క సెల్ ఫోన్లను స్వాదినపరచుకోవడం జరిగింది.
నిందితులు తాము దొంగిలించినటువంటి సొమ్మును హైదరాబాద్ కు చెందిన 4) శ్రీనివాస్ గుప్తా వద్ద తాకట్టు పెట్టిననట్లు ఒప్పుకోవడం జరిగింది. గతంలో కూడా నేరస్తులు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ లలో పలు నేరాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది.
కావున ప్రజలందరికీ తెలియజేయడం అనేది ఏమనగా ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఏదైనా వ్యాపారం గురించి మాయమాటలు చెప్పి నమ్మించి వారు ఇచ్చేటువంటి డ్రింకులను తాగకుండా, తమ యొక్క సొమ్ము పోగొట్టుకోకుండా ఉండాలని పోలీసు వారు తెలియపరచడం జరిగింది.

కేసులో చాకచక్యంగా పని చేసిన పోలీస్ కానిస్టేబుల్లు అయిన, షేకర్, రమేష్, సనగేష్, ASI-రవిందార్ మరియు సిబ్బందిని అభినందించడం జరిగినది.