రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ గారు సంగారెడ్డి నుండి నారాయణ ఖేడ్ వెళ్తున్న TGSRTC బస్సు వైకుంఠ పురం సమీపంలో బస్సు ప్లేక్సీలను తరలించే ఆటో ను వెనుకనుండి డీ కోన్న ఘటనలో జరిగిన ప్రమాదంలో

భారత్ న్యూస్ డిజిటల్:హైదరాబాద్:

రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ గారు సంగారెడ్డి నుండి నారాయణ ఖేడ్ వెళ్తున్న TGSRTC బస్సు వైకుంఠ పురం సమీపంలో బస్సు ప్లేక్సీలను తరలించే ఆటో ను వెనుకనుండి డీ కోన్న ఘటనలో జరిగిన ప్రమాదంలో బస్సు లో ప్రయాణిస్తున్న బాలిక పూజ మృతి చెందటం తో పాటు 7 గురు ప్రయాణికులు గాయపడిన ఘటన పై మంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నారాయణ ఖేడ్ మండలం రాయకల్ గ్రామానికి చెందిన పూజ.. బాసర లోని IIIT మొదటి సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతున్న పూజ (17) ఈ ఘటన లో తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించే సమయంలో చనిపోయిన సమాచారం తెలుసుకోని మంత్రి విచారం వ్యక్తం చేసారు. ఈ ఘటనలో గాయపడిన 7 గురు ప్రయాణికులకు మెరుగైన వైద్యాన్ని అందించాల్సిందిగా జిల్లా కలేక్టర్ ప్రావిణ్య, జిల్లా వైద్య శాఖాధికారి ని అదేశించారు. ఈ ఘటన లో నిషిత అనే ప్రయాణికురాలు చేయ్యి విరిగిపోయడం తో అమె కు మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డి లోని ప్రవేట్ అసుపత్రికి తరలించడం జరిగిందని మంత్రి కి వైద్య శాఖాధికారి వెల్లడించారు. స్వల్పంగా గాయపడిన ఇతర ప్రయాణికులకు చికిత్స అందించి అండగా నిలవాలని మంత్రి అదేశించారు.