(మునుపటి Twitter) లోని AI చాట్‌బాట్ Grok ద్వారా అసభ్యమైన, అశ్లీల కంటెంట్ తయారవడం మరియు షేర్ అవడంపై భారత ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.

భారత్ న్యూస్ గుంటూరు…X / Grok వివాదం

X (మునుపటి Twitter) లోని AI చాట్‌బాట్ Grok ద్వారా అసభ్యమైన, అశ్లీల కంటెంట్ తయారవడం మరియు షేర్ అవడంపై భారత ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.

కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) ఆదేశాల మేరకు
సుమారు 3,500 పోస్టులు తొలగించబడ్డాయి
600కు పైగా ఖాతాలు డిలీట్ చేయబడ్డాయి

X సంస్థ తన తప్పును అంగీకరించి, భారత చట్టాలకు అనుగుణంగా పనిచేస్తామని భవిష్యత్తులో ఇలాంటి కంటెంట్ రాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది

ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని, AI ద్వారా నకిలీ/అశ్లీల చిత్రాలు సృష్టించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

ఈ ఘటన AI వినియోగంపై నియంత్రణలు ఎంత అవసరమో మరోసారి చూపిస్తోంది.