భారత్ న్యూస్ విజయవాడ…పొగమంచులో వాహనాలతో సాహసం వద్దు. మంచు తగ్గాకే కదలండి

Ammiraju Udaya Shankar.sharma News Editor…సంక్రాంతి సంబరం విషాదంగా మారకూడదు
పండుగకు ఉరికి చేరాలన్న ఆత్రుత మీ ప్రాణాలకు ప్రమాదం కావొద్దు
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కమ్మేసిన దట్టమైన పొగమంచు మృత్యువుకు ముసుగులా మారింది
ఎదురుగా ఏముందో కనిపించని పరిస్థితుల్లో వాహనాలు నడపడం అత్యంత ప్రమాదకరం
పొగమంచులో వాహనాల్లో ప్రయాణం చేయడం వీలైనంత వరకు నివారించండి
తెల్లవారుజామున లేదా అర్ధరాత్రి వేళల్లో సాహస ప్రయాణాలు చేయకండి
పొగమంచు పూర్తిగా తగ్గి, రహదారి స్పష్టంగా కనిపించిన తర్వాతే ప్రయాణం ప్రారంభించండి
మీ రాక కోసం మీ కుటుంబ సభ్యులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు. వారి కళ్లలో ఆనందం నింపండి..కన్నీళ్లు కాదు
తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు పాటించండి
పొగమంచు ఉన్నప్పుడు వాహనం నడపాల్సి వస్తే ఫాగ్ లైట్లు, ఇండికేటర్లు తప్పనిసరిగా ఆన్ చేయండి
ముందు వెళ్లే వాహనానికి తగినంత భద్రతా దూరం పాటించండి
రోడ్డు ఖాళీగా ఉందని భావించి వేగంగా వద్దు
మన కుటుంబం కోసం మన జాగ్రత్తే నిజమైన సంక్రాంతి కానుక
మీ ఆత్మీయులకు షేర్ చేయండి

తాజా అప్డేట్స్ కోసం జాయిన్ అవ్వండి