భారత్ న్యూస్ ఢిల్లీ…..రోడ్డు ప్రమాదాల నివారణకు వీ2వీ సాంకేతిక పరిజ్ఞానం : నితిన్ గడ్కరీ
రోడ్డు ప్రమాదాలను నివారించడానికి కార్లలో ఉచిత స్పెక్ట్రమ్‌ను ఉపయోగించి వెహికల్ టు వెహికల్ (V2V) కమ్యూనికేషన్ టెక్నాలజీని ప్రవేశపెట్టేందుకు కృషి చేస్తున్నట్లు గడ్కరీ తెలిపారు.
దీని ద్వారా వాహనాలు ఒకదానికొకటి వైర్‌లెస్‌గా సమాచారం పంపుకుంటూ డ్రైవర్లను అప్రమత్తం చేస్తాయని ఆయన తెలిపారు.

డ్రైవర్‌కు రియల్‌టైంలో సమీపంలోని ఇతర వాహనాలు, స్పీడు, ప్రమాదకర ప్రాంతాలు తదితర వివరాలు పంపించి, తగిన హెచ్చరికలు చేయడానికి ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తామని చెప్పారు.