ఏపీ ప్రభుత్వం – కీలక ప్రకటన

భారత్ న్యూస్ విజయవాడ…ఏపీ ప్రభుత్వం – కీలక ప్రకటన

పేద బ్రాహ్మణుల కోసం ‘గరుడ’ పథకం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేద బ్రాహ్మణుల సంక్షేమం కోసం ‘గరుడ’ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించనుంది.

బ్రాహ్మణ కుటుంబంలో మరణం సంభవిస్తే

సంబంధిత కుటుంబానికి రూ. 10,000/- ఆర్థిక సాయం అందజేయనున్నారు.

ఈ పథకం కష్ట సమయంలో బ్రాహ్మణ కుటుంబాలకు ఉపశమనం కలిగించేందుకు రూపకల్పన చేయబడింది.

ఇప్పటికే పథకం అమలుకు సంబంధించిన కార్యాచరణ ప్రారంభమైంది.

అమరావతి సచివాలయంలో
మంత్రి సవిత గారు – బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చిరాంప్రసాద్ గారితో సమావేశమై

గరుడ పథకం అమలు విధానంపై చర్చించారు.

అధికారిక మార్గదర్శకాలు విడుదలైన వెంటనే పూర్తి వివరాలు తెలియజేయబడతాయి.