పంట వ్యర్థాలతో రోడ్ల నిర్మాణం!

భారత్ న్యూస్ విజయవాడ…పంట వ్యర్థాలతో రోడ్ల నిర్మాణం!

పంట వ్యర్థాల వల్ల దేశ రాజధాని నగరం ఢిల్లీలో గాలి కలుషితమవుతున్నదనే ఆరోపణలకు ఇక చెల్లు! త్వరలోనే ఈ వ్యర్థాలు నాణ్యమైన రోడ్లుగా మారవచ్చు. వరి దుబ్బులు, ఇతర పంటల వ్యర్థాలను రోడ్ల నిర్మాణానికి ఉపయోగపడే మెటీరియల్‌గా మార్చగలిగే కొత్త బయో-బిటుమెన్‌ టెక్నాలజీ అందుబాటులోకి రాబోతున్నది.