తరగని ప్రేమ…. వాత్సల్యంఇది కదా నాయకుడి లక్షణం…

భారత్ న్యూస్ విశాఖపట్నం..తరగని ప్రేమ…. వాత్సల్యం
ఇది కదా నాయకుడి లక్షణం…

Ammiraju Udaya Shankar.sharma News Editor…జగదీష్ ను శాలువాతో సత్కరించిన మాజీ ముఖ్యమంత్రి జగన్

చల్లపల్లి:
సాధారణంగా రాజకీయ నాయకుల మనస్తత్వం ఎలా ఉంటుందంటే.. ఎవరైనా కార్యకర్త లేదా క్రింది స్థాయి నాయకుడు చూడటానికి లేదా కలవడానికి వచ్చారంటే లోపలికి పిలిచామా… ఎలా ఉన్నారు? అని అడిగామా… ఫోటో దిగేసి పట్టించుకోకుండా ముఖం పక్కకు తిప్పేసామా..? అన్నట్లుగా ఉంటుంది వ్యవహారం. కొందరైతే ఫోటో దిగే అవకాశం కూడా లేకుండా పక్కకు లాగేసే పరిస్థితి. ఇది అందరికీ తెలిసిన జగమెరిగిన సత్యం. కానీ జనం మెచ్చిన జగన్ అలా కాదని మరోసారి నిరూపించుకున్నారు. తనను కలవటానికి వచ్చిన కార్యకర్తలను, నాయకులను అక్కున చేర్చుకుంటారనే దానికి చల్లపల్లి మండల యూత్ నాయకుడు వెనిగళ్ళ తారక జగదీష్ జగన్ కలవడానికి వెళ్ళినప్పుడు ఆప్యాయంగా నవ్వుతూ పలకరించి, ఫోటో దిగి శాలువా కప్పి సత్కరించి ప్రోత్సహించడమే ఎందుకు నిదర్శనం. అందుకనేమో ప్రజల హృదయాలలో నిలిచి జగన్ జననాయకుడు అయ్యాడు అనటంలో ఎటువంటి సందేహం లేదేమో.