కాలుష్య నియంత్రణకు ‘సముద్ర ప్రతాప్‌’

భారత్ న్యూస్ గుంటూరు….కాలుష్య నియంత్రణకు ‘సముద్ర ప్రతాప్‌’

సముద్రంలో కాలుష్య నియంత్రణ కోసం పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో భారత్‌ తయారుచేసిన తొలి నౌక ‘సముద్ర ప్రతాప్‌’ జలప్రవేశం చేసింది. సోమవారం గోవాలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చేతుల మీదుగా ‘సముద్ర ప్రతాప్‌’ ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌లో చేరింది.

గోవా షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ తయారుచేసిన ఈ నౌక పొడవు 114.5 మీటర్లు కాగా, బరువు 4,200 టన్నులు. సముద్రంపై కాలుష్య నియంత్రణ నిబంధనలు, సముద్ర చట్టాల అమలు, గాలింపు, సహాయక చర్యలకు, భారతదేశ ప్రత్యేక ఆర్థిక మండలాన్ని పరిరక్షించడంలో ఈ నౌక కీలకంగా మారనున్నది.