భారత్ న్యూస్ రాజమండ్రి..IRCTC టికెట్ బుకింగ్ సమయం పొడిగింపు
రైలు టికెట్ల అక్రమ విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు IRCTC బుకింగ్ నిబంధనలను
కఠినతరం చేసింది. జనవరి 5 నుంచి ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కేవలం ఆధార్ వెరిఫైడ్ వినియోగదారులు మాత్రమే టికెట్లు బుక్ చేసుకునే వీలుంటుంది. జనవరి 12 నుంచి ఉదయం 8 నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు ఈ సమయాన్ని పొడిగించనున్నారు. తత్కాల్ బుకింగ్స్కు ఇప్పటికే ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే.
