అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగు దంపతుల మృతి

భారత్ న్యూస్ రాజమండ్రి…అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగు దంపతుల మృతి

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు దంపతులు మృతి చెందారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన భార్యాభర్తలు కొటికలపూడి కృష్ణ కిశోర్‌ (టిన్ను) (45), ఆశ (40) వాషింగ్టన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వారి కుమార్తె, కుమారుడికి తీవ్రగాయాలయ్యాయి.