భారత్ న్యూస్ ఢిల్లీ…..కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC) సీజన్ 17 గ్రాండ్ ఫినాలే నేడు అత్యంత భావోద్వేగభరితంగా జరగనుంది. హోస్ట్ అమితాబ్ బచ్చన్ తన 25 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. “నా జీవితంలో మూడింట ఒక వంతు మీతో గడపడం నా అదృష్టం” అని ఆయన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ముగింపు ఎపిసోడ్‌లో అగస్త్య నందా సందడి, కికు శారద హాస్యం, బిగ్ బి అరుదైన సంగీత ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ వీడ్కోలు ప్రసంగం అభిమానులను తీవ్రంగా కదిలిస్తోంది.
