.భారత్ న్యూస్ హైదరాబాద్….మళ్లీ మొదటికొచ్చిన హైదరాబాద్ మెట్రో రైల్ టేకోవర్!

Ammiraju Udaya Shankar.sharma News Editor…రేవంత్ రెడ్డి ప్రభుత్వపు అలసత్వం, అధికారుల నిర్లక్ష్యం ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పేందుకు ఇదొక తాజా ఉదాహరణ. హైదరాబాద్ మెట్రో రైల్‌ను ఎల్ & టీ నుండి రూ 15,000 కోట్లకు కొనుగోలు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించి నాలుగు నెలలు గడచినా, ఈ వ్యవహారం ఒక అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కు అన్నచందంగా తయారైంది.
తాజాగా ఈ టేకోవర్‌ను దగ్గరుండి జరపడానికి టెండర్ వేసి మరీ ఎంపిక చేసిన ట్రాన్సాక్షన్ అడ్వైజర్ “ఐడీబీఐ క్యాపిటల్” సంస్థకు మెట్రో రైల్, లేదా మామూలు రైల్వే టెక్నాలజీని సాంకేతికంగా మదింపు చేసే అనుభవం కానీ సామర్ధ్యం కానీ లేవని తెలిసింది. దీంతో తలపట్టుకున్న అధికారులు ఈ అంశాల్లో పూర్వ అనుభవం ఉన్న మరొక కన్సల్టెంట్ కోసం వెతుకులాట మొదలుపెట్టారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు నెలల్లో ఎల్ & టీ టేకోవర్ చేస్తాం అని నాలుగు నెలల క్రితం బీరాలు పలికినా, నిజానికి ఇప్పుడు కొత్త ట్రాన్సాక్షన్ అడ్వైజర్‌ను ఎన్నిక చేసే ప్రక్రియనే మరో ఆరునెలలు పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఎల్ & టీ సంస్థ ఎన్నో ఒప్పందాలు కుదుర్చుకుందని, అవన్నీ సరిగ్గా అధ్యయనం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేస్తే, ఆ తరువాత లీగల్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని మెట్రో ఉన్నతాధికారులు చెబుతున్నారు.
మెట్రోను టెకోవర్ చేయడానికి రూ 15,000 కోట్ల డబ్బు కావాలని. అసలే ఆర్థిక పరిస్థితి సరిగ్గాలేని ఈ సమయంలో అంత డబ్బును సమకూర్చుకోవడం కూడా కష్టమేనని ఆర్థికశాఖ అధికారులు అంటున్నారు.
ఎల్ & టీ సంస్థకు లీజుకు ఇచ్చిన 200 ఎకరాల భూమి, షాపింగ్ మాల్స్ అన్నీ తెగనమ్మి మెట్రో రైల్‌ను కొందాం అనే ప్లాన్‌లో రేవంత్ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.

రెండేళ్లుగా రేవంత్ ప్రభుత్వ నిష్క్రియాపరత్వంతో నూతన మెట్రో రైల్ నిర్మాణ ప్రణాళికలు అన్నీ ఆగిపోవడంతో నగర ప్రజలు ట్రాఫిక్ జాంలతో నరకం చవి చూస్తున్నారు