భారత్లోకి పాకిస్థాన్ డ్రోన్.. సెర్చ్ ఆపరేషన్ ముమ్మరం!

భారత్ న్యూస్ ఢిల్లీ…..భారత్లోకి పాకిస్థాన్ డ్రోన్.. సెర్చ్ ఆపరేషన్ ముమ్మరం!

పాకిస్థాన్ డ్రోన్ జమ్మూకశ్మీర్లోకి చొరబడటం సంచలనంగా మారింది.

LoCని దాటి వచ్చి 5 ని.లు మన భూభాగంలోనే ఉన్న డ్రోన్ పేలుడు పదార్థాల బ్యాగ్ను వదిలి వెనక్కి వెళ్లిందని ఓ అధికారి తెలిపారు.

నిన్న పూంఛ్ సెక్టార్లోని చకన్ దా బాగ్ ప్రాంతంలో బ్యాగులోని IED, బుల్లెట్లు, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.

సీజ్ చేసిన ఎల్ఈడి ని జవాన్లు పేల్చేసి సరిహద్దులో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు…