బెజవాడ దుర్గమ్మ ఆలయం కీలక నిర్ణయం.

భారత్ న్యూస్ విజయవాడ…బెజవాడ దుర్గమ్మ ఆలయం కీలక నిర్ణయం

AP: బెజవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై VIP, VVIPలు దర్శనం కోసం తప్పనిసరిగా టికెట్ కొనుగోలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. రోజుకు 200 నుంచి 300 మంది VIP, VVIPలు సిఫార్సు లెటర్లతో టికెట్ లేకుండా దర్శనం చేసుకుంటున్నట్లు ఆలయ ఈవో దృష్టికి వెళ్లింది. దీంతో ఆలయ ఆదాయానికి గండి పడుతున్నట్టు గుర్తించారు. ఈ విధానానికి అడ్డుకట్ట వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.