భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.కవిత చిట్ చాట్: కేసీఆర్ సభకు రాకపోతే బీఆర్ఎస్ పని ఖతం

Ammiraju Udaya Shankar.sharma News Editor…కేసీఆర్ తప్పు చేయకపోతే సభకు రావాలని కవిత అభిప్రాయం వ్యక్తం చేశారు. శాసనమండలి వద్ద మీడియా ప్రతినిధులతో కవిత ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సభకు రాకపోతే బీఆర్ఎస్ పని ఖతమైనట్లేనన్నారు. సభకు రాకుండా పిల్ల కాకులకు సభాసమయాన్ని వదలొద్దని కేసీఆర్కు సూచించారు. హరీష్ రావు కు ప్యాకేజీలు, అమ్ముకోవడం తప్ప ఏం తెలియదన్నారు. కేసీఆర్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా ఖండించారు.
హరీష్ రావు, రేవంత్ రెడ్డి..సీఎం చాంబర్ లో అరగంట మాట్లాడుకున్నారని కవిత ఆరోపించారు. కేసీఆర్ మాత్రమే నీటి పంపకాలపై సమాధానం ఇవ్వగలదని కవిత స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఫిక్సుడ్ మ్యాచ్ జరుగుతోందన్నారు. హరీష్ కు మాట్లాడే చాన్స్ ఇవ్వడం సరి కాదని కవిత స్పష్టం చేశారు. రేవంత్ వర్సెస్ హరీష్ అన్నట్లుగా అసెంబ్లీ నడవబోతోందని ఇది చాలా ప్రమాదకరమని కవిత వ్యాఖ్యానించారు. కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో తనకు తెలియదని..తాను మాట్లాడి నాలుగు నెలలు అవుతోందన్నారు.
కవిత కేసీఆర్ పై డైరక్ట్ గా ఇలా మాట్లాడటం ఇదే మొదటి సారి. కేటీఆర్, హరీష్ లకు వదిలేస్తే ఆశలు వదిలేసుకోవాల్సిందేనని ఆమె చెప్పడం ఓ పాయింట్ అయితే.. కేసీఆర్ తప్పు చేయకపోతే అసెంబ్లీకి రావాలని అనడం మరో పాయింట్. సాధారణంగా విపక్ష నేతలు .. ఆయన అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేసేవారు ఈ పాయింట్ తో విమర్శలు చేస్తారు. కానీ కవిత అలాంటి వ్యాఖ్యలు చేశారు. అంటే కవిత కూడా బీఆర్ఎస్ పార్టీనే కాదు.. కేసీఆర్ ను రాజకీయంగా ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారని అనుకోవచ్చు.

బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. కానీ మండలి చైర్మన్ ఆమోదించలేదు. సాధారణంగా అయితే రాజీనామాను ఆమోదించాలి. కానీ ఇప్పుడు ఆమోదిస్తే ఉపఎన్నికలు వస్తాయి. లోకల్ ఎలక్షన్స్ పూర్తి అయిన తర్వాత ఆమోదించాలన్న ఆలోచనలో ఉన్నారేమో కానీ.. పట్టించుకోలేదు. ఈ కారణంగా కవిత మరోసారి శాసనమండలి స్పీకర్ ను కలిసి.. తన రాజీనామాను ఆమోదించాలని మరోసారి కోరారు.