అమరావతి నిర్మాణ పనుల్లో మరో కీలక అడుగు.. పంపింగ్ స్టేషన్-2 పనులకు టెండర్ల ఖరారు!

భారత్ న్యూస్ విశాఖపట్నం..అమరావతి నిర్మాణ పనుల్లో మరో కీలక అడుగు.. పంపింగ్ స్టేషన్-2 పనులకు టెండర్ల ఖరారు!

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఉండవల్లి వద్ద పంపింగ్ స్టేషన్-2 నిర్మాణం

మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాకు నిర్మాణ పనుల అప్పగింత

రాజధాని ప్రాంతంలో నీటి ముంపు ఏర్పడకుండా ఉండటమే ప్రాజెక్టు లక్ష్యం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వరద సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాజధాని ప్రాంతంలో భారీ వర్షాలు కురిసినప్పుడు, నీరు నిల్వలు ఏర్పడకుండా ఉండేందుకు చేపడుతున్న వరద నియంత్రణ చర్యల్లో భాగంగా, ఉండవల్లి గ్రామం వద్ద ‘పంపింగ్ స్టేషన్–2’ నిర్మాణానికి టెండర్లను ప్రభుత్వం ఖరారు చేసింది.

అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ADCL) ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టును జోన్–8 పరిధిలో నిర్మించనున్నారు. ఈ పంపింగ్ స్టేషన్ ద్వారా వరదల సమయంలో సుమారు 8,400 క్యూసెక్కుల నీటిని కృష్ణా నదిలోకి పంపించేలా డిజైన్ చేశారు. వర్షాకాలంలో రాజధాని ప్రాంతంలో నీటి ముంపు ఏర్పడకుండా ముందస్తు రక్షణ కల్పించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.