కోడిపందాలు నిర్వహించే అనుమానం ఉన్న లంకపల్లి గ్రామంలో హెచ్చరిక బ్యానర్లను పోలీసులు ఏర్పాటు చేశారు.

భారత్ న్యూస్ గుంటూరు….కృష్ణా జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు, డిఎస్పి తాళ్లూరి విద్యశ్రీ, చల్లపల్లి సిఐ ఈశ్వరరావు ఆదేశాల మేరకు కోడిపందాలు నిర్వహించే అనుమానం ఉన్న లంకపల్లి గ్రామంలో హెచ్చరిక బ్యానర్లను పోలీసులు ఏర్పాటు చేశారు.

సంక్రాంతి ముసుగులో కోడిపందాలు, జూదక్రీడలు నిర్వహిస్తే కఠిన చర్యలు చేపడతామంటూ ఘంటసాల ఎస్ఐ ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు.

మండల పరిధిలోని లంకపల్లిలో గతంలో కోడిపందాలు నిర్వహించిన ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. కోడిపందాలు, గుండాట, పేకాట, జూదం, అశ్లీల నృత్యాలు తదితర అసాంఘిక కార్యకలాపాలు నిషేదించటమైనదని తెలిపారు. అతిక్రమించిన వ్యక్తులు, సంస్థలపైన చట్టపరమైన గేమింగ్ యాక్ట్, క్రిమినల్ యాక్ట్ ప్రకారం చర్యలు చేపడతామని ఎస్ఐ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతాన్ని ట్రాక్టర్ తో దున్నించారు.