భారత్ న్యూస్ విజయవాడ…పొగాకు, పాన్ మసాలాపై 40% జీఎస్‌టీ
l
ఫిబ్రవరి 1 నుంచి అమలు
భారీగా పెరుగనున్న ధరలు
పొగాకు,పాన్ మాసాలా ఉత్పత్తులపై ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కొత్త పన్ను విధానం అమల్లోకి రానున్నది.

ఈ ఉత్పత్తులపై ప్రస్తుతం ఉన్న జీఎస్‌టీ రేట్లకు అదనంగా అదనపు ఎక్సైజ్ సుంకాన్ని, హెల్త్ సెస్సును కేంద్రం విధించడంతో ఈ కొత్త పన్ను విధానం అమలు కానున్నది. హానికర వస్తువులుగా పరిగణించే ఈ ఉత్పత్తులపై ప్రస్తుతమున్న నష్టపరిహార సెస్సు స్థానాన్ని కొత్త పన్ను విధానం భర్తీ చేస్తుంది.