న్యూఇయర్‌ను 16 సార్లు సెలబ్రేట్‌ చేసుకోనున్న వ్యోమగాములు.. ఎలా అంటే?

భారత్ న్యూస్ ఢిల్లీ…..న్యూఇయర్‌ను 16 సార్లు సెలబ్రేట్‌ చేసుకోనున్న వ్యోమగాములు.. ఎలా అంటే?

ఇంటర్నెషనల్‌ స్పేస్‌ స్టేషన్‌ (ISS‌) గంటకు 28,000 కిలో మీటర్ల వేగంతో తిరుగుతుంది. దీంతో 90 నిమిషాల్లో భూమి చుట్టూ ఒక రౌండ్‌ పూర్తి చేస్తుంది. ఈ నేపథ్యంలో ఐఎస్‌ఎస్‌లోని వ్యోమగాములు ప్రతి 45 నిమిషాలకు ఒకసారి భూమిపై పగలు, 45 నిమిషాల తర్వాత రాత్రిని చూస్తారు.

మరోవైపు ఐఎస్‌ఎస్‌ ఒక రోజులో భూమి చుట్టూ 16 సార్లు పరిభ్రమిస్తుంది. దీంతో అందులోని వ్యోమగాములు ప్రతి రోజు 16 సార్లు సూర్యోదయాన్ని, 16 సార్లు సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తారు. అలా ఐఎస్‌ఎస్‌లోని వ్యోమగాములు కొత్త ఏడాదిని 16 సార్లు స్వాగతం పలుకురు. తద్వారా న్యూఇయర్‌ను 16 సార్లు సెలబ్రేట్‌ చేసుకునే అరుదైన అవకాశం వారికి లభిస్తుందన్నమాట