నూతన సంవత్సరం కానుకగా ఒక రోజు ముందే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ.

భారత్ న్యూస్ నెల్లూరు..నూతన సంవత్సరం కానుకగా ఒక రోజు ముందే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

అవనిగడ్డ :అవనిగడ్డ లో బుధవారం ఉదయం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండుగలా సాగింది. నూతన సంవత్సర కానుకగా ప్రభుత్వం ఒక రోజు ముందుగానే పెన్షన్లను పంపిణీ చేయాలని నిర్ణయించడంతో, సచివాలయ సిబ్బంది తెలుగుదేశం పార్టీ నేతలకు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి వృద్ధులు, వితంతువులు మరియు దివ్యాంగులకు పెన్షన్లు పంపిణీ చేశారు.పెన్షన్ మొత్తాన్ని పెంచి, ఇంటి వద్దకే వచ్చి సకాలంలో అందజేస్తుండటంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై తమ కృతజ్ఞతలు లబ్ధిదారులు చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు టీడీపీ నేతలు పర్చూరి దుర్గాప్రసాద్,బండే రాఘవ,ఘంటసాల రాజమోహనరావు,దాసినేని శ్రీనివాసరావు,బట్టు నరసింహారావు,మైల హరిబాబు,కోట సాయి,జటావత్తు శ్రీను తదితరులు పాల్గొన్నారు