3300మంది భక్తులకు మజ్జిగ పంపిణీ.

భారత్ న్యూస్ …శ్రీకాకుళంలో 3300మంది భక్తులకు మజ్జిగ పంపిణీ

శ్రీకాకుళం – ఘంటసాల :-

ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలో వేంచేసియున్న శ్రీకాకుళేశ్వర స్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంగళవారం జరిగిన ఉత్తర ద్వార దర్శనంకు వచ్చిన భక్తులకు ప్రముఖ పారిశ్రామికవేత్త విక్కుర్తి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు.

శ్రీకాకుళంకు పెద్ద ఎత్తున భక్తులు రావడంతో విక్కుర్తి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భక్తులకు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేసినట్లు పోతన ఆంజనేయులు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పోతన కాకుళేశ్వరరావు, పోతన రాదాకృష్ణ, పోతన రవి, అంబటి నాగరాజు, కొండవీటి ఏడు కొండలు, మోటేపల్లి గౌతీశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.