..భారత్ న్యూస్ హైదరాబాద్….సమీక్షలో కొత్త జోనల్ కమిషనర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశా నిర్దేశం

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ ఎకానమి ఏరియాను
ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది
రాష్ట్రాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకోవాలనే తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేసుకున్నాం
క్యూర్( CURE) పరిధిలోని సిటీని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా పునర్వ్యవస్థీకరించాం
పరిపాలనను పట్టాలెక్కించాలనేదే మా ఆలోచన
హైదరాబాద్ నగరంలో అత్యంత సంక్లిష్టమైన సమస్య చెత్త నిర్వహణ
కోర్ అర్బన్ రీజియన్ ను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది
జోన్ ల వారీగా సంబంధిత సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత జోనల్ కమిషనర్ లదే
జోనల్ కమిషనర్లు ప్రతీ రోజు ఫీల్డ్ లో ఉండాల్సిందే
సిటీలో ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలని నిర్ణయించాం
చెరువులు, నాలాలను ఆక్రమణల నుంచి కాపాడుకోవాలి
క్యూర్ పరిధిలో డీజిల్ బస్సులు, ఆటోల స్థానంలో ఈవీ వెహికిల్స్ ను తీసుకురావాలని నిర్ణయించాం
సిటీలో కాలుష్య నియంత్రణకు అవసరమైన పూర్తిస్థాయి ప్రక్షాళన తీసుకుంటున్నాం
చెరువులు, నాలాలు, చెత్త డంపింగ్ ఏరియాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి
నెలకు మూడు రోజులు శానిటేషన్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలి
రోడ్లపై ఎక్కడా చెత్త కనిపించడానికి వీల్లేదు.. రోడ్లపై గుంతలు కనిపించొద్దు
జనన మరణ ధ్రువీకరణ, ట్రేడ్ లైసెన్సులు, ఇతర ధ్రువ పత్రాల జారీకి టెక్నాలజీని ఉపయోగించుకోవాలి
ఆన్ లైన్ టెక్నాలజీని ఉపయోగించి ప్రజలకు పారదర్శక సేవలు అందించాలి.
కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, అపార్ట్ మెంట్ అసోసియేషన్ లతో కమ్యూనికేషన్ ఉండేలా చూసుకోవాలి
గుడ్ గవర్నెన్స్ నుంచి స్మార్ట్ గవర్నెన్స్ కు మారాలి
హైడ్రా, జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ విభాగాలు నాలాల పూడిక తీత పనులు జనవరి నుంచి మొదలు పెట్టాలి
నగరంలో వీధి దీపాలు సరిపడా ఉండేలా చూసుకోవాలి
క్యూర్ ఏరియాలో విభాగాల అధికారులను సమన్వయం చేసే బాధ్యత స్పెషల్ సీఎస్ చూసుకుంటారు
దోమల నివారణ, అంటువ్యాధులు ప్రబలకుండా జోనల్ కమిషనర్ చర్యలు చేపట్టాలి
ప్రతీ పది రోజులకోసారి గార్బేజ్ క్లియరెన్స్ డ్రైవ్ నిర్వహించాలి
ఎక్కడ సమస్య తలెత్తినా పరిష్కరించేందుకు టోల్ ఫ్రీ నంబర్ కు వీలయినంత స్పీడ్ గా రెస్పాన్స్ అవ్వాలి
వచ్చే ఐదేళ్లకు యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలి

అందరూ కలిసి పనిచేస్తేనే నగరం భవిష్యత్ బాగుంటుంది..