భారత్ న్యూస్ విజయవాడ…AP: నేడు ఏపీ కేబినేట్ సమావేశం

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సోమవారం ఉదయం 11 గంటలకు జరగనుంది. జిల్లాల పునర్విభజన నుంచి రాజధాని అమరావతి అభివృద్ధి వరకూ పలు అంశాలపై లోతైన చర్చ జరగనుంది. (AP) ముఖ్యంగా జిల్లాల పునర్విభజన, పీపీపీ విధానం, రుషికొండపై నిర్ణయం తీసుకోనుంది మంత్రివర్గం. మదనపల్లి, మార్కాపురం, పోలవరం జిల్లాల ప్రతిపాదనలతో తలెత్తిన సమస్యలపై చర్చించనుంది. మరోవైపు అమరావతిలో క్వాంటం వ్యాలీ, సీఆర్డీఏ పరిధిలోని భారీ అభివృద్ధి పనులపై కీలక నిర్ణయాలు తీసుకోనుంది కేబినెట్
AP Cabinet: జిల్లాల పునర్విభజనపై కీలక నిర్ణయం..! నేడే ఏపీ కేబినేట్ సమావేశం.. పూర్తి వివరాలు..
ప్రభుత్వ లక్ష్యం
అమరావతిలో కల్చరల్ సెంటర్ ఏర్పాటు, అంతర్జాతీయ ప్రమాణాలతో హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కూడా చర్చ జరగనుంది. రాజధాని ప్రాంతాన్ని కేవలం పరిపాలనా కేంద్రంగా కాకుండా సాంస్కృతిక, ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.
ఇదే క్రమంలో 56వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం లభించనుంది. రైతులకు సంబంధించిన భూముల వివాదాలపై రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు అంశం కూడా క్యాబినెట్ ముందుకు రానుంది
