ఒరిస్సా నుంచి దిగుమతిగా వచ్చిన గంజాయి పట్టివేత..

భారత్ న్యూస్ డిజిటల్:హైదరాబాద్: ఒరిస్సా నుంచి దిగుమతిగా వచ్చిన గంజాయి పట్టివేత..

6.300 కేజీల గంజాయి స్వాధీనం స్వాధీనం.

సరూర్నగర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని రాఘవేంద్ర భవన్ హుడా కాలనీ సమీపంలో ఒరిస్సా నుంచి గంజాయిని కొందరు వ్యక్తులు తీసుకువచ్చారనే సమాచారం మేరకు ఎస్టిఎఫ్ సి టీం సీఐ వెంకటేశ్వర్లు సిబ్బంది కలిసి దాడి నిర్వహించారు.

ఈ దాడిలో 6.300 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసులో ఒరిస్సాకు చెందినటువంటి బెహన్ దూరే జగన్నాథ్ డాల్ సరోజ్ జలారి అనే ముగ్గురిని అరెస్ట్ చేసి సరూర్నగర్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్లు సిఐ తెలిపారు.