సీఎం రిలీఫ్ ఫండ్ రూ. 40 లక్షలకు పైగా, 47 చెక్కులు బాధితులకు అందించిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి.

భారత్ డిజిటల్ న్యూస్ నంద్యాల:

  • పేద రోగుల మనో ధైర్యం సీఎం చంద్రబాబు నాయుడు
  • సీఎం రిలీఫ్ ఫండ్ రూ. 40 లక్షలకు పైగా, 47 చెక్కులు బాధితులకు అందించిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి.

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా లేకున్నా పేద రోగులు ఇబ్బంది పడకూడదని, ముఖ్యమంత్రి సహాయ నిధితో ఆర్ధిక భరోసా కల్పించి ఆధుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతున్నామని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.

ఆదివారం నంద్యాల పార్లమెంట్ పరిధిలోని 47 మంది భాదితులకు, సుమారు రూ. 40 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు నేరుగా భాధితులకే ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అందజేశారు.

ఈ సందర్బంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ మనసున్న మా రాజు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పేదలు ఆసుపత్రి లో వైద్యం తీసుకొని ఆర్ధిక భరోసా కోసం తన ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోగా పేదల ఆర్ధిక పరిస్థితి అర్థం చేసుకొని వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ విడుదల చేసి మీకు నేనున్నానన్న భరోసా కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఋణం తీర్చుకోలేనిదన్నారు.

నంద్యాల పార్లమెంట్ పరిధిలోని మిడ్తూరు మండలం తిమ్మాపురం కు చెందిన ఎన్. అనిత కు (ఫణి భూషణ్ రెడ్డి) రూ.902645 లు,
కర్నూలు నగరం, 4వ తరగతి కాలనీకి చెందిన కమల్ బాషాకు రూ. 405341లు, గడివేముల మండలం కరిమద్దేల గ్రామానికి చెందిన శీల. మల్లేశ్వర్ కు రూ.116606 లు, పగిడ్యాలకు చెందిన ఎం జయరాఘవ నాయుడుకు రూ.122195 లు,
రుద్రవరం మండలం చిన్న కంబాలూరుకు చెందిన వై. నాగరాజుకు రూ.131747లు, నంద్యాల మండలం, అయ్యలూరు కు చెందిన టి.పెద్ద అవులన్నకు రూ.131564లు, అయ్యలూరు కు చెందిన బి.జయలక్ష్మి కి రూ.15000లు, అయ్యలూరుకు చెందిన బి.జిగ్నేష్ కుమార్ కు రూ.33037లు, డోన్ మండలం, చిన్న మల్కాపురంకు చెందిన జె. శేఖర్ కు రూ.50250లు, నంద్యాల పట్టణం, లలితా నగర్ కు చెందిన
ఆదినారాయణ రెడ్డి కి రూ.121677 లు, నంద్యాల మండలం మిట్నాలకు చెందిన కె. రత్నమ్మకు రూ.48500 లు, సిరివెళ్ల మండలం చెన్నూరుకు చెందిన జి రాహుల్ రుషికి రూ.20000లు, సిరివెళ్ల మండలం కోటపాడుకు చెందిన రాణెమ్మ కు రూ.20000 లు, ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల కు చెందిన డి. దస్తగిరికి రూ.25000 లు, నంద్యాల పట్టణం ఫరూక్ నగర్ కు చెందిన ఎ. శివ శంకర రెడ్డికి రూ. 48795లు, నంద్యాల ఎన్ జి ఓ కాలనీకి చెందిన టి సరితకు రూ.34000 లు, కొత్తపల్లి మండలం గోకవరం కు చెందిన జె దాక్షాయణికి రూ.42600 లు, రుద్రవరం కు చెందిన కె లక్ష్మీ నరసింహులుకు రూ.75000లు, కర్నూలు నగరం ఏ పి హెచ్ పి కాలనీ కి చెందిన కె శ్రావణికి రూ.75785లు, దొర్నిపాడు మండలం చాకరాజువేములకు చెందిన
భూమా చిన్న నారాయణ కు
రూ.35184లు, నంద్యాల చాంద్ బడాకుచెందిన జి యశస్వినిరెడ్డికి రూ.40000లు, నంద్యాల నీలివీధికి చెందిన బాషాకు రూ.18500లు, నంద్యాల మండలం అయ్యలూరుకు చెందిన
కే. హేమకు రూ.15164లు,
ఓర్వకల్లు మండలం, కొమరోలు కు చెందిన వెంకటేశ్వర్లుకు (వైరలు డెత్ ) రూ. 54910లు, పాణ్యం మండలం, నెరవాడ కు చెందిన ఏ. తులసమ్మ కు రూ.115818 లు, నంద్యాల మండలం చాపిరేవుల కు చెందిన ఇ ఇందిర ప్రియదర్శినికి, రూ. 96572 లు, బండి ఆత్మకూరు మండలం, ఏ. కోడూరు కు చెందిన
ఎస్ శిరీషకు రూ.20000లు, బండి ఆత్మకూరు మండలం చిన్న దేవలాపురంకు చెందిన కె పుష్పలతకు రూ. 37378లు, ఓర్వకల్లు మండలం, ఉయ్యాలవాడ కు చెందిన ఎం. మురళీరెడ్డికి రూ.73418 లు, మిడ్తూరు మండలం తలముడిపికి చెందిన కె. స్వర్ణలత కు రూ. 50000 లు, గడివేముల మండలం బిలకళగూడూరు కు చెందిన పి ఎస్ నాగలక్ష్మమ్మ కు రూ. 60000 లు, నంద్యాల మండలం ఊడుమాలుపురంకు చెందిన చిన్న వెంకటేశ్వర్లు కు రూ. 30000 లు, బండి ఆత్మకూరు మండలం సింగవరం కు చెందిన ఎస్. షకీర్ బీ కి రూ. 40000 లు, వెలుగోడు మండలం వేల్పనూరు కు చెందిన జి. నాగేశ్వరమ్మకు రూ. 50000 లు, నంద్యాల నీలివీధి కి చెందిన కే. వసుంధర కు రూ. 146712 లు , నంద్యాల మండలం కానాలకు చెందిన ఎం. రాజేశ్వరి కి రూ. 25541 లు, నంద్యాల విశ్వనగర్ కు చెందిన కె. మల్లికమ్మ కు రూ. 26038లు, నంద్యాల మండలం అయ్యలూరు కు చెందిన ఎం. నాగభూషణం కు రూ. 122220 లు, దొర్నిపాడు మండలం చాకరాజువేముల కు చెందిన భూమా మనోజ్ కుమార్ రెడ్డి కి రూ. 69584 లు, కర్నూలు రాఘవేంద్ర నగర్ కు చెందిన పి. చంద్రమ్మ కు రూ. 55000 లు, ఓర్వకల్లు మండలం హుసేనాపురం కు చెందిన అశ్వత్తామయ్య కు రూ. 25655 లు, కర్నూలు నగరం రామచంద్ర నగర్ కు చెందిన టీ. తేజేశ్వరి కి రూ. 18000 లు, నంద్యాల వి సి కాలనీ కి చెందిన అబ్దుల్ రసీదు కు రూ. 31000 లు, అవుకు మండలం మిట్టపల్లి కి చెందిన కే. సరోజ కు రూ. 35000 లు, నంద్యాల ఎస్ బి ఐ కాలనీ కి చెందిన ఏ. జయలక్ష్మమ్మ కు రూ. 69327 ల చెక్కులు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పంపిణీ చేయగా, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందుకున్న భాధితులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు, నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి లకు కృతజ్ఞతలు తెలిపారు.