చేబ్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి జరిగిన హత్య సంఘటన స్థలాన్ని పరిశీలించిన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు,.

భారత్ న్యూస్ డిజిటల్:గుంటూరు:

*చేబ్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి జరిగిన హత్య సంఘటన స్థలాన్ని పరిశీలించిన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు,.
నిన్న(27.12.2025) రాత్రి చేబ్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాకోడూరు గ్రామ శివారులో జరిగిన హత్య ఘటనకు సంబంధించి, ఈ రోజు జిల్లా ఎస్పీ సంఘటన స్థలాన్ని స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా నేర స్థలాన్ని సవివరంగా పరిశీలించి, ఘటనకు సంబంధించిన వివరాలను అక్కడి సంబంధిత పోలీస్ అధికారుల నుండి సేకరించారు. కేసు దర్యాప్తును వేగవంతం చేసి, నిందితులను త్వరితగతిన గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఇటువంటి క్రూరమైన, చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.

కేసుకు సంబంధించి అన్ని కోణాలలో విచారణ కొనసాగుతోందని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు తెలిపారు.

తర్వాత చేబ్రోలు పోలీస్ స్టేషన్ను సందర్శించి, శాంతి భద్రతలు కాపాడే విషయంలో స్థానిక పోలీస్ అధికారులు తీసుకుంటున్న చర్యల పట్ల ఆరా తీశారు.చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఏ మాత్రం ఉపేక్షించరాదని, కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రౌడీ షీటర్లు, శాంతి భద్రతలకు సమస్యలకు కారణం అయిన వారికి తగిన కౌన్సెలింగ్ నిర్వహించాలని సూచించారు.

అదనపు ఎస్పీ GV రమణమూర్తి. తెనాలి డిఎస్పీ శ్రీ జనార్ధన్ గారు, ఎస్‌బి డిఎస్పీ శ్రీ శ్రీనివాసులు గారు, ఎస్‌బి సీఐ-1 అలహరి శ్రీనివాస్ గారు మరియు చేబ్రోలు ఎస్సై వీర నారాయణ కూడా సంఘటన స్థలాన్ని సందర్శించారు.