ఈ నెల 30న రూ.4,000 కోట్ల రుణ సమీకరణ చేయనున్న ప్రభుత్వం

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఈ నెల 30న రూ.4,000 కోట్ల రుణ సమీకరణ చేయనున్న ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వం రూ.4,000 కోట్ల రుణం సమీకరించనుంది.

ఈ నెల 30న రిజర్వుబ్యాంకు నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొని ఈ మొత్తం రుణంగా స్వీకరించనుంది.

వేర్వేరుగా రూ.1,000 కోట్ల చొప్పున 9, 10, 12, 17 ఏళ్ల కాలపరిమితితో తిరిగి తీర్చేలా ఈ అప్పు తీసుకుంటున్నారు.

ఎంత వడ్డీకి ఈ రుణం లభిస్తుందనేది డిసెంబర్ 30న ఖరారవుతుంది.