భారత్ న్యూస్ డిజిటల్:జీహెచ్ఎంసీ వ్యాప్తంగా ప్రజావాణికి 187 ఆర్జీలు
జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 62 విన్నపాలు, ఫిర్యాదులు అందాయి.
అలాగే జిహెచ్ఎంసి పరిధిలోని ఆరు జోన్లలో మొత్తం 125 అర్జీలు వచ్చాయి. అందులో కూకట్ పల్లి జోన్ లో 52, సికింద్రాబాద్ జోన్ లో 26, శేరిలింగంపల్లి జోన్ లో 19 ఎల్బీనగర్ జోన్ లో 17, ఖైరతాబాద్ జోన్ లో 6, చార్మినార్ జోన్ లో 5 ఫిర్యాదులు వచ్చాయి.

కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ లు రఘు ప్రసాద్, సుభద్రాదేవి, అలివేలు మంగతాయారు, సత్యనారాయణ, వేణుగోపాల్, సి ఈ రత్నాకర్, ఎ.సి.పి లు ప్రదీప్ కుమార్, వెంకన్న, జాయింట్ కమీషనర్ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు