ప్రమాదం ఘటనా స్థలాన్ని సందర్శించి ప్రమాద కారణాలపై డీసీపీ విచారణ

భారత్ న్యూస్ డిజిటల్: రామగుండం పోలీస్ కమీషనరేట్:

ప్రమాదం ఘటనా స్థలాన్ని సందర్శించి ప్రమాద కారణాలపై డీసీపీ విచారణ

భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా భద్రత చర్యలు తీసుకుంటాం : మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్

రామగుండం పోలీస్ కమీషనరేట్
మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ ఇందారం క్రాస్ రోడ్ సమీపంలో ఈరోజు ఉదయం మహారాష్ట్ర చంద్రాపూర్ నుంచి వరి నాట్లు వేసేందుకు 22 మంది కూలీలతో సుల్తానాబాద్ వెళ్తున్న ట్రాలీ వాహనం రోడ్డు ప్రక్క పార్క్ చేసి ఉండగా దానిని లారీ వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. 14 మంది గాయపడగా వారిని మెరుగైన చికిత్స కోసం చంద్రపూర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. అట్టి ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ స్వయంగా సందర్శించి ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాదం కి గల కారణాలు అధికారులను అడిగి తెలుసుకొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన డీసీపీ ప్రమాదం జరగడానికి ఖచ్చితమైన కారణాలను తెలుసుకోవాలనీ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తక్షణమే భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయాలని సూచించారు.

డీసీపీ గారి వెంట జైపూర్ ఏసీపీ ఆర్ వెంకటేశ్వర్లు, జైపూర్ సీఐ నవీన్, జైపూర్ ఎస్ ఐ శ్రీధర్, సిబ్బంది పాల్గొన్నారు.