జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ మార్గనిర్దేశకత్వంలో

భారత్ న్యూస్ డిజిటల్: మేడ్చల్ మల్కాజిగిరి:

“జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ మార్గనిర్దేశకత్వంలో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో పరిశ్రమల ప్రమాదాల నివారణపై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) చెర్లపల్లి స్మార్ట్ టెర్మినల్‌ (హైదరాబాద్ టెర్మినల్) సర్వే నెం. 183, ఫేజ్ III, మహాలక్ష్మి నగర్, చెర్లపల్లి, సికింద్రాబాద్ లో సోమ వారం సాయంత్రం 5 గంటల నుండి పరిశ్రమల లో జరిగే అగ్ని ప్రమాదాల నివారణ చర్యలపై మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది.
ఒక ట్యాంక్ నుండి మరొక ట్యాంకు కు ఆయిల్ పంపింగ్ చేసేటప్పుడు ఆయిల్ ఓవర్ ఫ్లో అయినప్పుడు జరిగే ఫైర్ యాక్సిడెంట్ పై మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. ఈ అంశంపై తీసుకోవాల్సిన అత్యవసర నివారణ చర్యలు, జాగ్రత్తలు పై వివిధ శాఖల సమన్వయంతో ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు చేపట్టవలసిన చర్యలపై మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. ఈ మాక్ డ్రిల్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ మాక్ డ్రిల్ లో NDRF, RDF, Medical, Fire, Industrial, Pollution control board, Police, Traffic, Civil Supplies, Animal Husbandry, Revenue, Panchayat raj, R&B, GHMC, Logistics శాఖ వారు ప్రమాద నివారణ చర్యలు చేపట్టారు. సమాచార శాఖ మీడియా పాయింట్ ఏర్పాటు చేసి వాస్తవ వార్తలను, ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగస్వాములైనారు