.భారత్ న్యూస్ హైదరాబాద్….రాష్ట్రపతిని కలిసిన బ్రహ్మానందం
టాలీవుడ్ హాస్య నటుడు బ్రహ్మానందం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యా దపూర్వకంగా కలిశారు. ఆదివారం హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతిని శాలువతో సత్కరించి తన అభిమానాన్ని చాటుకున్నారు. తాను స్వయంగా గీసిన ఆంజనేయ స్వామివారి చిత్రపటాన్ని రాష్ట్రపతికి బహుకరించారు. రాష్ట్రపతిని కలసి గౌరవించడం పట్ల బ్రహ్మీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
