భారత్ న్యూస్ రాజమండ్రి…ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం,రాష్ట్ర డీజీపీ ఆదేశాలనుసారం నేడు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 వేల పైగా నూతన పోలీస్ కానిస్టేబుల్స్‌కు తొమ్మిది నెలల బేసిక్ శిక్షణ కార్యక్రమం ప్రారంభమవుతుందని జిల్లా ఎస్పీ శ్రీ కె.వి. మహేశ్వర రెడ్డి, ఐపీఎస్ గారు తెలిపారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో రాజమండ్రి,కృష్ణా జిల్లాలకు చెందిన 145 మంది కానిస్టేబుల్ కు జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు.ఈ శిక్షణ కాలంలో ఔట్‌డోర్ మరియు ఇన్డోర్ విధానంలో వివిధ అంశాలపై సంపూర్ణ స్థాయిలో శిక్షణ అందించబడుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ ఏడాది పోలీస్ శిక్షణలో సాంకేతిక నైపుణ్యాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. సైబర్ నేరాలను అరికట్టడం, కంప్యూటర్ స్కిల్స్, ఆధునిక పోలీసింగ్ విధానాలపై ప్రత్యేకంగా సమగ్ర శిక్షణ ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.రాష్ట్రంలో సిబ్బంది కొరతను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ నియామక ప్రక్రియను చేపట్టిందని, ఇందుకు గాను రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర డీజీపీ గారికి జిల్లా ఎస్పీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
