భారత్ న్యూస్ తిరుపతి,ఈ నెల 23న తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

Ammiraju Udaya Shankar.sharma News Editor…తిరుమల :
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 23న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా 23న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆరోజు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఈ కారణంగా అష్టదళపాద పద్మారాధన సేవను రద్దు చేశామన్నారు…..
