కమిషనరేట్ లో ఘనంగా కాకా వెంకటస్వామి వర్ధంతి వేడుకలు

భారత్ న్యూస్ డిజిటల్:రామగుండం:

కమిషనరేట్ లో ఘనంగా కాకా వెంకటస్వామి వర్ధంతి వేడుకలు

సేవ, క్రమశిక్షణ, నైతికతకు జి. వెంకటస్వామి గారి జీవితం నిదర్శనం: అదనపు డీసీపీ కె. శ్రీనివాస్

కాక జి వెంకటస్వామి వర్ధంతి వేడుకలను ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా అదనపు డీసీపీ (అడ్మిన్ ) కె. శ్రీనివాస్, పోలీస్ అధికారులు వెంకటస్వామి గారి చిత్ర పటానికి పూలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్బంగా డిసిపి అడ్మిన్ గారు మాట్లాడుతూ…. సేవ, క్రమశిక్షణ, నైతికతకు జి. వెంకటస్వామి గారి జీవితం నిదర్శనం అన్నారు. సుదీర్ఘకాలం పాటు కేంద్ర మంత్రిగా, పార్లమెంటు సభ్యునిగా ప్రాతినిథ్యం వహించిన వెంకటస్వామి దళిత, బడుగు, బలహీన, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేశారని, ఆయన సేవలను గుర్తిస్తూ నిరంతరం స్మరించుకునేలా ప్రభుత్వం అధికారికంగా జయంతి, వర్ధంతి వేడుకలను నిర్వహిస్తోందని అన్నారు.

ఈకార్యక్రమంలో ఏ ఆర్ ఏసీపీ ప్రతాప్, ఏ ఓ శ్రీనివాస్, పీసీ ఆర్ ఇన్స్పెక్టర్ రవీందర్, ఆర్ఐ దామోదర్, శ్రీనివాస్, శేఖర్, మల్లేశం, సూపరడెంట్స్ ఇంద్రసేన, సందీప్, సంధ్య, సిబ్బంది పాల్గొన్నారు