పోలీస్ శాఖ ఆద్వర్యంలో వెంకటస్వామి ( కాకా ) వర్ధంతి నిర్వాహణ

భారత్ న్యూస్ డిజిటల్:నిజామాబాద్:

పోలీస్ కమిషనర్ కార్యాలయం

పోలీస్ శాఖ ఆద్వర్యంలో వెంకటస్వామి ( కాకా ) వర్ధంతి నిర్వాహణ

నేడు నిజామాబాద్ అదనపు డి.సి.పి ( అడ్మిన్ ) శ్రీ జి. బస్వారెడ్డి గారి ఆదేశానుసారంగా తేది : 22-12-2025 నాడు ఉదయం 11: 00 గం॥ల సమయంలో నిజామాబాద్ కమిషనరేటు కార్యాలయంలో నిజామాబాద్ పోలీస్ కార్యాలయం పరిపాలన అధికారి (ఎ.ఓ) శ్రీమతి ఆసియా బేగం గారు కీ॥ శే॥ వెంకటస్వామి ( కాకా) గారి వర్ధంతి నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా పరిపాలన అధికారి గారు మాట్లాడుతూ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని, తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటాల్లో అన్ని దశల్లోనూ స్పూర్తినినిలిపారని, పేదల పెనిదిగా పేరుగాంచారు  అనీ తెలియజేశారు.భవిష్యత్ తరాలకోసం అనునిత్యంప్రతిఒక్కరు కష్టపడాలని, భావి తరాల కోసం బంగారు బాట వేయాలని పోలీస్ శాఖ సిబ్బంది అందరికీ , పరిపాలన అధికారి (ఎ.ఓ) గారు పిలుపునిచ్చారు.

ఈ వర్ధంతి సందర్బంగా సి.సి.ఆర్.బి, సి.ఐ లు శ్రీ రమేష్, పాండేరావ్, రమేష్, ఎలక్షన్ సెల్ సి.ఐ శ్రీ వీరయ్య, రిజర్వు ఇన్స్పెక్టర్స్ శ్రీ శ్రీనివాస్ (అడ్మిన్ ), ఆఫీస్ సూపరింటెండెంట్లు శ్రీ బషీర్, శ్రీ శ్రీనివాస్, పోలీస్ కార్యాలయం సిబ్బంది, సి.సి.ఆర్.బి సిబ్బంది, సి.ఎస్.బి సిబ్బంది ఐ.టి కోర్ సిబ్బంది, పోలీస్ కంట్రోల్ రూమ్ సిబ్బంది, సెంట్రల్ కాంప్లెంటు సెల్ సిబ్బంది హజరు కావడం జరిగింది.