భారత్ న్యూస్ డిజిటల్: అమరావతి: శ్రీకాకుళం జిల్లా పోలీసు,
అక్రమ (పిస్టల్) ఆయుధంతో పట్టుబడిన ఐదుగురు నిందితులు అరెస్టు.ll
ll జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర రెడ్డి ఐపిఎస్. ll
ll నేరాలను అరికట్టే ముందస్తు చర్యలలో భాగంగా నిందితులను పట్టుకోవడం జిల్లా పోలీస్ యంత్రాంగం పనితీరు అభినందనీయం.. జిల్లా ఎస్పీ.ll
శ్రీకాకుళం డిసెంబర్ 21. శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్మ్స్ యాక్ట్ కేసులో ఐదుగురు నిందితుల అరెస్టు చేసి,వారి వద్ద నుండి ఒక పిస్టల్ మరియు ఒక మ్యాగజిన్ శ్రీకాకుళం రూరల్ పోలీసు వారు స్వాధీనం చేసుకున్నట్లు, ఆదివారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పత్రిక సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర రెడ్డి ఐపిఎస్., వెల్లడించారు.
కేసు వివరాలు:క్రైమ్ నెంబర్:
Cr.No. 289/2025
U/Sec. 25, 27 Arms Act – 1959, R/w 109 IPC శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్.
కేసు సంక్షిప్త వివరాలు:
తేదీ 21.12.2025 న ఉదయం సుమారు 10:00 గంటల సమయంలో, శ్రీకాకుళం మండలం, తండ్యాంవలస గ్రామం, ఆర్.టి.ఓ కార్యాలయం సమీపంలోని జగనన్న కాలనీలో నిర్మాణంలో ఉన్న ఒక ఇంటి వద్ద, శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్.ఐ. గారు తమ సిబ్బంది సహాయంతో ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని తనిఖీ చేయగా, వారి వద్ద నుండి ఒక పిస్టల్,ఒక మ్యాగజిన్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. కేసు విచారణలో, నిందితులు పంచిరెడ్డి కైలాష్ మరియు గతంలో మరణించిన ఎచ్చెర్ల మండలం సత్తరు గోపి అను వారు నేరాలు చేయాలనే ఉద్దేశంతో, సదరు పిస్టల్‌ను ఒడిశా రాష్ట్రం, బరంపూర్ లో నివసిస్తున్న సంతోష్ అనే వ్యక్తి వద్ద నుండి 3 రౌండ్లతో సహా కొనుగోలు చేసినట్లు తెలిపారు.అనంతరం, పంచిరెడ్డి కైలాష్, అలబన మణి, కలగ ఉమా మహేశ్వరరావు మరియు వుర్జాన ప్రశాంత్ కుమార్ లు, సదరు పిస్టల్‌ను తమకు అప్పగించాలని థండాసి కార్తిక్‌ను కోరగా, కార్తిక్ పిస్టల్ ఇవ్వడం కోసం ఆర్ టి ఓ ఆఫీస్ వెనుక భాగంలో ఉన్న జగనన్న కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇంటి వద్దకు వచ్చి పిస్టల్ అందజేస్తుండగా, పోలీసుల చేతికి పట్టుబడ్డారు.సదరు పిస్టల్‌ను ఎందుకు కొనుగోలు చేశారు, ఏ నేరం చేయడానికి ఉద్దేశించారు, ఇందుకు ఆర్థిక సహాయం ఎవరు అందించారు అనే అంశాలపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది అని జిల్లా ఎస్పీ తెలిపారు.
అరెస్టు అయిన నిందితుల వివరాలు:
1)పంచిరెడ్డి కైలాష్, S/o సుబ్బారావు, వయస్సు 25 సంవత్సరాలు, వెలమ కులం, బొంతలకొడూరు గ్రామం, ఎచ్చెర్ల మండలం.
2)అలబన మణి, S/o రమణ, వయస్సు 32 సంవత్సరాలు, యాదవ కులం, గుజరాతిపేట, శ్రీకాకుళం పట్టణం.
3)కలగ ఉమా మహేశ్వరరావు, S/o అప్పన్న, వయస్సు 30 సంవత్సరాలు, యాదవ కులం, పెద్దపాడు గ్రామం, శ్రీకాకుళం గ్రామీణ మండలం.
4)వుర్జాన ప్రశాంత్ కుమార్, S/o లేట్ జగ్గునాయుడు, వయస్సు 31 సంవత్సరాలు, పి.కాపు కులం, నారాయణవలస గ్రామం, కోటబొమ్మాళి మండలం.
5) థండాసి కార్తిక్, S/o జగదీశ్వరరావు, వయస్సు 33 సంవత్సరాలు, క్షత్రియ కులం, ఎల్బిఎస్ కాలనీ, శ్రీకాకుళం పట్టణం.
నిందితులపై ఉన్న పాత కేసుల వివరాలు:
పంచిరెడ్డి కైలాష్,(శ్రీకాకుళం 1 టౌన్,ఎచ్చెర్ల పి.ఎస్.)
2) అలబన మణి:(– శ్రీకాకుళం 1 టౌన్ – ఎచ్చెర్ల పి.ఎస్.)
3) కలగ ఉమా మహేశ్వరరావు:(ఎచ్చెర్ల పి.ఎస్.)
4) వుర్జాన ప్రశాంత్ కుమార్: – జె.ఆర్.పురం పి.ఎస్. పరిధిలో పలు కేసులు ఉన్నాయి.
నేరాలు జరిగిన తర్వాత నిందితులను పట్టుకోవడం ఒక ఎత్తు అయితే,నేరాలను అరికట్టే తీసుకుంటున్న ముందస్తు చర్యలలో భాగంగా నిందితులను పట్టుకోవడం జిల్లా పోలీస్ యంత్రాంగం పనితీరు అభినందనీయం.. జిల్లా ఎస్పీ కొనియాడారు.

ప్రతిభకు ప్రశంసలు:
పై కేసులో నిందితులను చాకచక్యంగా అదుపులోకి తీసుకొని,అక్రమంగా కలిగి ఉన్న పిస్టల్ మరియు మ్యాగజిన్‌ను స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచినందుకు,
శ్రీకాకుళం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీ సి.హెచ్. వివేకానంద గారి సూచనల మేరకు,శ్రీకాకుళం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ కె. పైడుపు నాయుడు గారి పర్యవేక్షణలో పని చేసిన శ్రీకాకుళం రూరల్ ఎస్.ఐ. శ్రీ కె. రాము మరియు వారి సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ కె.వి. మహేశ్వర రెడ్డి, ఐపీఎస్ గారు ప్రత్యేకంగా అభినందించారు.