గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు విస్తృత సోదాలు నిర్వహిస్తున్న జిల్లా పోలీస్ యంత్రాంగం

భారత్ న్యూస్ డిజిటల్: అమరావతి ,:బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం, ప్రెస్ నోట్, తేది:21.12.2025

గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు విస్తృత సోదాలు నిర్వహిస్తున్న జిల్లా పోలీస్ యంత్రాంగం

జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ ఆదేశాలతో ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో సోదాలు

బాపట్ల, చీరాల, జీఆర్పీ, ఈగల్ సెల్, డాగ్ స్క్వాడ్‌లతో ఎస్‌బీ ఇన్స్పెక్టర్ రాంబాబు గారి ఆధ్వర్యంలో విస్తృత సోదాలు

10 కేజీల గంజాయి స్వాధీనం, ఒక వ్యక్తి అరెస్ట్

గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు

పాత నేరస్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాం

గంజాయి క్రయవిక్రయాలు, రవాణాకు పాల్పడుతున్న 228 మందిపై షీట్లు ఓపెన్ చేశాము

జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు

జిల్లాలో ఎవరైనా గంజాయి క్రయవిక్రయాలు లేదా అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు హెచ్చరించారు. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఆదివారం ఎస్‌బీ–2 ఇన్స్పెక్టర్ ఎం.రాంబాబు ఆధ్వర్యంలో బాపట్ల, చీరాల పోలీసులు, జీఆర్పీ, ఈగల్ సెల్ సిబ్బంది, పోలీస్ జాగిలాలతో సంయుక్తంగా ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో సోదాలు నిర్వహించడం జరిగింది.

బాపట్ల నుంచి చీరాల వరకు నిర్వహించిన ఈ సోదాల్లో ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో అక్రమంగా రవాణా చేస్తున్న 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అక్రమ రవాణాకు పాల్పడుతున్న కేరళ రాష్ట్రానికి చెందిన అసిన్ శిబూ (23) అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతడు విజయనగరం నుంచి కేరళకు గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు పోలీస్ అధికారులు గుర్తించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు మాట్లాడుతూ జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గతంలో గంజాయి సంబంధిత కేసుల్లో అరెస్టైన నిందితులపై నిఘా ఉంచామని, వారి కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.

గంజాయి సంబంధిత కేసుల్లో పట్టుబడిన వారిపై సంబంధిత పోలీస్ స్టేషన్లలో షీట్లు తెరవడం జరిగిందని, ఇప్పటి వరకు 228 మందిపై షీట్లు ఓపెన్ చేసినట్లు తెలిపారు. యువత భవిష్యత్తును అంధకారంగా మార్చుతున్న గంజాయిని సమూలంగా నిర్మూలించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని చెప్పారు.

నిరంతరం వాహన తనిఖీలు నిర్వహించడంతో పాటు, నిర్మానుష్య ప్రదేశాలు మరియు గంజాయి సేవించడానికి అనువుగా ఉన్న ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు.గంజాయి వలన కలిగే అనర్ధాల గురించి పాఠశాలలు, కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ట్రైన్లను కూడా క్రమం తప్పకుండా తనిఖీ చేస్తున్నామని పేర్కొన్నారు.

ఈరోజు SB 2 ఇన్స్పెక్టర్ రాంబాబు ఆధ్వర్యంలో బాపట్ల నుంచి చీరాల రైల్వే స్టేషన్ వరకు ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో పోలీస్, జీఆర్పీ, ఈగల్ సెల్ సిబ్బంది, పోలీస్ జాగిలాలతో సంయుక్తంగా నిర్వహించిన సోదాల్లో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న కేరళ రాష్ట్రానికి చెందిన అసిన్ శిబూ (23) ను అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. నిందితుడిపై తదుపరి విచారణ కొనసాగుతున్నట్లు తెలిపారు.