భారత్ న్యూస్ డిజిటల్:అమరావతి:
ll మహిళా హత్య కేసులో నిందితుడు అరెస్టు.ll
ll జిల్లా ఎప్సీ శ్రీ కెవి మహేశ్వర రెడ్డి ఐపిఎస్. ll
శ్రీకాకుళం,(డిసెంబర్ 21.)తేదీ 03.12.2025 ఉదయం 08:00 గంటలకు ఎచ్చెర్ల పోలీసు స్టేషన్ పరిధిలో, కింతలి మిల్ జంక్షన్ సమీపంలో,విశాఖపట్నం–శ్రీకాకుళం NH–16 సర్వీస్ రోడ్డులో జరిగిన హత్య నేరం కేసులో నిందితుడిని ఎచ్చెర్ల పోలీసు వారు అరెస్టు చేసి నట్లు ఆదివారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పత్రిక సమావేశంలో కేసు జిల్లా వివరాలను ఎప్సీ శ్రీ కెవి మహేశ్వర రెడ్డి ఐపిఎస్ వెల్లడించారు.
కేసు వివరాలు:
కేసు నెంబర్:
Cr.No. 279/2025,
U/s 103(1), 303(2) BNS
(ముందుగా 194 BNSS – అనుమానాస్పద మృతిగా నమోదు).
ముద్దాయి పేరు పేరు గొల్లపల్లి ప్రశాంత్ కుమార్ (నరసన్నపేట నివాసి).
కేసు సంక్షిప్త విషయాలు:
తేదీ 03.12.2025 ఉదయం 08:00 గంటలకు ఎచ్చెర్ల పోలీసు స్టేషన్ ఎస్.ఐ. గారికి 112 ద్వారా సమాచారం అందగా, వెంటనే సిబ్బందితో కలిసి కింతలి మిల్ జంక్షన్ వద్దకు చేరుకొని, NH–16 సర్వీస్ రోడ్డుపై గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించారు. మృతురాలి ఫోటోలను సామాజిక మాధ్యమాల ద్వారా షేర్ చేయగా, అదే రోజు ఉదయం 09:30 గంటలకు గురుగుబెల్లి వెంకటరమణ (వయస్సు 21 సం.), కొత్తవలస గ్రామం, ఆమదాలవలస మండలం, ప్రస్తుతం ఎ.ఎస్.ఎన్ కాలనీ, శ్రీకాకుళం నివాసి, మృతురాలు తన తల్లి గురుగుబెల్లి సీతారత్నం అని గుర్తించారు.
మృతురాలు 02.12.2025 సాయంత్రం 5:00 గంటలకు హాస్పిటల్ నిమిత్తం ఇంటి నుండి బయలుదేరి తిరిగి రాకపోవడంతో పాటు, ఆమె సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం వల్ల అనుమానం వ్యక్తం చేస్తూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు.తేదీ 12.12. 2025న ఫిర్యాదిదారు మళ్లీ పోలీసు స్టేషన్‌కు వచ్చి, మృతురాలు ఇంటి నుండి బయలుదేరే సమయంలో మెడలో మంగళసూత్రాలు, సెల్ ఫోన్ తీసుకెళ్లినట్లు, అవి మృతదేహం వద్ద గానీ, ఇంట్లో గానీ లభించలేదని తెలిపారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆభరణాల కోసం ఆమెను గొంతు నులిమి హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేయడంతో, కేసును హత్య నేరంగా మార్పు చేశారు.
నిందితుడి అరెస్టు వివరాలు:తేదీ 21.12.2025న JR పురం సీఐ అవతారం గారికి అందిన సమాచారం మేరకు, సీఐ గారు, ఎచ్చెర్ల ఎస్.ఐ. మరియు సిబ్బంది కలిసి జర్జామ్ జంక్షన్ సమీపంలోని గాయత్రి ధాబా వద్ద అనుమానాస్పద కారును అడ్డుకున్నారు.కారు డ్రైవర్‌ను విచారించగా, అతను తన పేరు గొల్లపల్లి ప్రశాంత్ కుమార్ (నరసన్నపేట నివాసి)గా తెలిపి, మృతురాలు సీతారత్నంను తానే హత్య చేసినట్లు అంగీకరించాడు.
నిందితుడిని అరెస్టు చేసి, అతని వద్ద నుండి రోల్డ్ గోల్డ్ చైన్,బంగారు శతమానం స్వాధీనం చేసుకోవడం జరిగింది.
సాంకేతిక ఆధారాలు:
మృతురాలి సెల్ ఫోన్ డేటా, ఐపిడిఆర్ సహాయంతో విశ్లేషించారు.మృతురాలు మాట్లాడిన వాట్సాప్ కాల్ నంబర్లు గుర్తించగా అవి నరసన్నపేటకు చెందిన గొల్లపల్లి ప్రశాంత్ కుమార్‌దిగా తేలింది. ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి కింతలి మిల్ వరకు ఉన్న సీసీ కెమెరాలు, హైవే సీసీ ఫుటేజీలను పరిశీలించి, ఒక కారును అనుమానించారు.టోల్ గేట్ లో లభించిన డేటా ఆధారంగా కార్ నెంబర్ AP39 H 3302గా గుర్తించారు.
నేరానికి కారణాలు (విచారణలో తేలిన అంశాలు) : మృతురాలు ఆర్థిక పరిస్థితుల కారణంగా కొంతమంది వ్యక్తులతో శారీరక సంబంధాలు పెట్టుకొని డబ్బులు సంపాదించేది. నిందితుడు గొల్లపల్లి ప్రశాంత్ కుమార్ గత రెండు సంవత్సరాలుగా మృతురాలితో పరిచయం కలిగి ఉండి, శారీరక సంబంధం కొనసాగిస్తూ ప్రతి సారి కలిసినప్పుడు రూ. 2,000/- ఇచ్చేవాడు.తేదీ 02.12.2025న మృతురాలు నిందితుడికి వాట్సాప్ కాల్ చేసి సాయంత్రం 6:00 గంటలకు డే & నైట్ జంక్షన్ వద్దకు రమ్మని చెప్పింది.అక్కడ మృతురాలు రూ.50,000/- డిమాండ్ చేస్తూ, ఇవ్వకపోతే వారి మధ్య ఉన్న సంబంధాన్ని నిందితుడి భార్యకు చెబుతానని బెదిరించింది. భయాందోళనకు గురైన నిందితుడు,మృతురాలిని ఎచ్చెర్ల వైపు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి,ఆమె చీర కొంగు మరియు పుస్తెల తాడుతో గొంతు బిగించి హత్య చేసి,మంగళసూత్రం మరియు సెల్ ఫోన్ తీసుకొని, మృతదేహాన్ని కింతలి మిల్ జంక్షన్ సమీపంలో రోడ్డుపై పడేసి పారిపోయాడు.
నిందితుడి గత నేర చరిత్ర:నిందితుడిపై నరసన్నపేట పోలీసు స్టేషన్‌లో మోటార్ సైకిల్ దొంగతనం కేసు నమోదై ఉంది.

ప్రతిభకు ప్రశంసలు:
జిల్లా పోలీసు సూపరింటెండెంట్ శ్రీ కె.వి. మహేశ్వర రెడ్డి, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు,శ్రీకాకుళం సబ్ డివిజనల్ పోలీసు ఆఫీసర్ శ్రీ సి.హెచ్. వివేకానంద గారి పర్యవేక్షణలో, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించి ఈ హత్య కేసును ఛేదించినందుకు కింది అధికారులను,సిబ్బందిని జిల్లా ఎస్పీ గారు అభినందించారు.