భారత్ న్యూస్ ఢిల్లీ…..దిల్లీకి రెడ్ అలర్ట్.. 150కి పైగా విమాన సర్వీసులు రద్దు
ఉత్తర భారతాన్ని పొగమంచు కప్పేసింది. దాంతో శుక్రవారం ఉదయం 100 మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది.
ఈ నేపథ్యంలో దిల్లీకి భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
రోడ్డు, రైలు, వాయు మార్గాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని హెచ్చరించింది.
దానికి తగ్గట్టే 150కి పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి.

మరో 200 సర్వీసుల్లో జాప్యం చోటుచేసుకుంది. ఈ అంతరాయాలు కొనసాగుతాయని దిల్లీ ఎయిర్పోర్ట్ వెల్లడించింది.