భారత్ న్యూస్ డిజిటల్:అమరావతి:
గుంటూరు జిల్లా పోలీస్…
అరండల్ పేట పోలీస్ స్టేషన్.
గంజాయి అక్రమరవాణతో పాటు అమ్మకం చేస్తున్న ముఠాను పట్టుకున్న పోలీసులు.12 .500 కిలోల గంజాయి స్వాధీనం.నిందితుల అరెస్ట్….
గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్, IPS గారి ఆదేశాల మేరకు, వెస్ట్ డివిజన్ SDPO శ్రీ K. అరవింద్ గారి పర్యవేక్షణలో, అరండల్ పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ K. ఆరోగ్యరాజు గారి నేతృత్వంలో పోలీస్ అధికారులు మరియు సిబ్బంది అరండల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కార్యకలాపాలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినారు.
❇️ ది.18.12.2025 తేదీన మధ్యాహ్నం సుమారు 02:30 గంటలకు బ్రాడిపేట ఒకటవ లైనులోని నిర్మానుష ప్రదేశంలో కొంతమంది గుంపుగా చేరి, గంజాయి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు అని అరండల్ పేట సీఐ గారికి రాబడిన సమాచారం మేరకు తన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని గుమికూడిన వారిని అదుపులోకి తీసుకుని విచారించి, వారి వద్ద ఉన్న 1.20 కేజీల గంజాయిని సీజ్ చేసి, Cr.no :- 896/2025, U/s 8(C) r/w 20(b)(ii)(A)(B) NDPS Act – 1985 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసినారు.
💫 దర్యాప్తు వివరాలు :- నిందితులు తమ చెడు వ్యసనాలకు బానిసలై, ఖర్చులకు డబ్బులు సరిపోక, హర్ష సాయి అనే వ్యక్తి వద్ద నుండి గంజాయి కొనుగోలు చేసి అధిక లాభానికి అమ్ముకోవాలని నిర్ణయించుకున్నారు. ముందుగా 3,000/- రూపాయలకు 1.500 కిలోల గంజాయిని కొనుగోలు చేసి అమ్ముకున్నారు. అనంతరం మరలా 3,000/- రూపాయలకు 1.200 కిలోల గంజాయిని కొనుగోలు చేసి, బ్రాడిపేట ఒకటవ లైను వద్ద పంచుకుంటుండగా పోలీసులకు పట్టుబడ్డారు.
👉 అరెస్ట్ కాబడిన నిందితులు:-
- మందా సుదీర్, తండ్రి: మోహన్ రావు, వయసు: 25 సం., సంజీవయ్యనగర్, గుంటూరు.
- గుమ్మా సాయి కుమార్, తండ్రి: రాము, వయసు: 25 సం., అడవితక్కెళ్ళపాడు గ్రామం, గుంటూరు రూరల్
- షేక్ బాజీ, తండ్రి: జమాల్ బాష, వయసు: 25 సం., నల్లచెరువు, గుంటూరు (ప్రస్తుతం: పెదకాకాని)
- షేక్ ఈశుబ్, తండ్రి: బాష, వయసు: 22 సం., నెహ్రూ నగర్, గుంటూరు
- కుంచం గోపి చంద్, తండ్రి: రాంబాబు, వయసు: 23 సం., బ్రాడిపేట, గుంటూరు.

👉 పైన పేర్కొన్న నిందితులు అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరిచిన సీఐ శ్రీ K. ఆరోగ్యరాజు గారినీ, SI శ్రీ M. క్రిష్ణ బాజీ బాబు గారిని, కానిస్టేబుళ్లు K. చిరంజీవులు, O. డేవిడ్, K. సేతులను వెస్ట్ డిఎస్పీ అరవింద్ గారు అభినందించారు.