భారత్ న్యూస్ విజయవాడ…జనవరి 15వ తేదీ తర్వాత ప్రజలకు అన్ని సేవలు ఆన్ లైన్లోనే
అన్ని ఫైళ్లూ..ఇక ఈ-ఫైళ్లే
ఫిజికల్ పైళ్లకు స్వస్తి పలకండి
అన్ని సేవలూ ఆన్లైన్లోనే అందించాలి
మొదటి ప్రాధాన్యం మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్కే
మనమిత్రపై ప్రజల్లో అవగాహన పెంచండి
సర్టిఫికెట్ల ఫిజకల్ వెరిఫికేషన్ కూడా అవసరం లేదు
బ్లాక్ చైన్ టెక్నాలజీతో డిజీ వెరిఫై చేసేయొచ్చు
కలెక్టర్లకు ఐటీ, ఆర్టీజీ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటంనేని సూచన
జిల్లాల్లోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ ఇకపై ప్రతి ఫైలు కూడా ఈ-ఫైలుగానే నిర్వహించాలని,
జనవరి 15వ తేదీ తర్వాత ప్రజలకు అన్ని సేవలు ఆన్ లైన్లోనే అందించనున్నామని ఈ దిశగా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఐటీ, రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటంనేని సూచించారు.
జనవరి 15వ తేదీ నుంచి ప్రజలకు ప్రభుత్వం అందించే సేవలన్నీ కూడా ఆన్లైన్లోనే అందించాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు.
తమ పనుల కోసం ప్రజలెవ్వరూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా అన్ని సేవలూ మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందిస్తున్నామన్నారు.
మనమిత్రను ప్రజలు సమర్థవంతంగా వినియోగించుకుని సులభంగా సేవలు పొందేలా చూడాలని చెప్పారు.
మనమిత్రపై ప్రజల్లో అవగాహన కల్పించి దీని వినియోగం పెంచేలా జిల్లాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
ఆయా శాఖల అధికారులు ఈ అవగాహన కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొని ఆయా శాఖలకు సంబంధించి సేవలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఎంత సుభంగా పొందవచ్చో ప్రజలకు వివరించాలన్నారు.

వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలు ప్రభుత్వం ఇచ్చే అన్ని రకాల సర్టిఫికెట్లు సులభంగా పొందవచ్చని, ప్రభుత్వానికి పన్నులు, బిల్లుల చెల్లింపు వరకు అన్నీ సులభంగా చేయొచ్చన్నారు.