ఏపిఎస్ఆర్టీసీ డోర్ డెలివరీ ప్రచార మాసోత్సవం,

భారత్ న్యూస్ విజయవాడ…ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ
జిల్లా ప్రజా రవాణా అధికారి కార్యాలయము
కృష్ణా జిల్లా, మచిలీపట్టణం

“ఏపిఎస్ఆర్టీసీ డోర్ డెలివరీ ప్రచార మాసోత్సవం

ఏపీఎస్ఆర్టీసీ ప్రజలకు మెరుగైన సేవలు అందించే కార్యక్రమంలో భాగంగా అందుబాటులో ఉన్న ఇతర ఆర్ధిక వనరులను సద్వినియోగం చేసుకుంటూ పార్సెల్ అండ్ కొరియర్ రంగంలోకి 2017 సంవత్సరం నుండి స్వంతంగా ప్రారంభించి, ప్రజల విశేషాదరణతో కొనసాగుతుంది.

అత్యంత చౌకగా వేగంగా సురక్షితంగా వస్తువులను అర్టీసీ కొరియర్ అండ్ పార్సెల్ సర్వీస్ ద్వారా బుక్ చేసిన 24 గంటల్లోపే డెలివరీ అందజేస్తుంది.

అందులో భాగంగా ‘2021 సంవత్సరం నుండి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నిక చేయబడ్డ 84 ప్రదేశాలలో “డోర్ డెలివరీ” సదుపాయం కూడా కల్పించినది.

మన కృష్ణాజిల్లాలో అవనిగడ్డ, మచిలీపట్నం, గుడివాడ, హనుమాన్ జంక్షన్, ఉయ్యూరు తదితర ప్రాంతాలలో బస్ స్టేషన్ చుట్టుపక్కల 10 కిలోమీటర్ల వరకు 50 కిలోల వరకు బరువు ఉన్న వస్తువులను, ఇతర పార్సిల్ కంపెనీలతో పోల్చుకుంటే చాలా తక్కువ ధరలకే డోర్ డెలివరీ సౌకర్యం కల్పించినది.

ఈ డోర్ డెలివరీ సదుపాయాన్ని విశేష ప్రచారం కల్పించాలనే ఉద్దేశంతో సంస్థలో పనిచేస్తున్న సిబ్బందిని, పార్సిల్ ఏబెంట్లను.

మరియు పార్సిల్ కౌంటర్ లో పనిచేయుచున్న ఆపరేటర్లను, హమాలీలను కూడా ఇందులో భాగస్వామ్యులయ్యేలా ది.20.12.2025 నుండి ది.19.01.2026 వరకు “కార్గో డెలివరీ ప్రచార మాసోత్సవం” నిర్వహించుచున్నాము. ఆర్టీసీ సిబ్బంది మరియు పార్సిల్ ఆఫీసులో పనిచేస్తున్న సిబ్బంది అందరూ ఈ మాసోత్సవమును మహోత్సవముగా విజయవంతం చేయుటకు, ప్రజలందరూ ఆర్టీసీ డోర్ డెలివరీ సౌకర్యాన్ని వినియోగించుకునేలా తమ పరిధి మేరకు అధిక ప్రచారం కల్పించాలని కోరుతూ

ప్రజలందరూ ఆర్టీసీ కల్పిస్తున్న “డోర్ డెలివరీ” సౌకర్యాన్ని వినియోగించుకుని, రానున్న పండుగల సీజన్ లో గ్రీటింగ్స్, స్వీట్లు మరియు బహుమతులు వంటివి ఆర్టీసీ డోర్ డెలివరీ ద్వారా పంపి, ఆనందంగా పండుగలు జరుపుకోవాలని ఏపీఎస్ఆర్టీసీ కృష్ణా జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీ కొడమంచిలి వెంకటేశ్వర్లు గారు ఆకాంక్షించారు

జిల్లా ప్రజా రవాణా అధికారి, ఏపిఎస్ఆర్టీసి, కృష్ణా జిల్లా, మచిలీపట్నం.