.భారత్ న్యూస్ హైదరాబాద్….మెస్సీతో రేవంత్ రెడ్డి ఫుట్బాల్ మ్యాచ్
ఉప్పల్ స్టేడియంలో మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతోంది. తొలుత తన టీమ్ ‘సింగరేణి’ తరఫున సీఎం రేవంత్ రెడ్డి మైదానంలోకి దిగారు. తర్వాత ‘అపర్ణ’ టీమ్ తరఫున బరిలోకి దిగిన మెస్సీ.. ఆటగాళ్లతో పాటు రేవంత్కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇద్దరూ కలిసి కాసేపు ఫుట్బాల్ ఆడారు. ఈక్రమంలోనే రేవంత్ గోల్ కొట్టారు. వీరిద్దరి ఆట చూసి అభిమానులు కేరింతలు కొడుతున్నారు.
